వరుసగా సినీ పరిశ్రమకు చెందిన వారు మరణిస్తూ ఉండడం మనం చూస్తూనే వస్తున్నాం.నటీనటులు, సాంకేతిక నిపుణులు వంటి వారు ఇటీవల కన్నుమూసిన సందర్భాలను మనం చూశాం. అంతేకాదు కొంతమంది హీరోలు, హీరోయిన్ల కుటుంబంలో కూడా మరణ వార్తలు ఎక్కువగా వినిపించాయి. మీనా భర్త, రాధిక శరత్ కుమార్ మాజీ భర్త, అర్జున్ తల్లి, నోయల్ తండ్రి, ఎన్టీఆర్ చిన్న కూతురు ఇలా చాలా మంది మరణించారు. అంతేకాకుండా బాలీవుడ్, కోలీవుడ్,మలయాళం,పంజాబీ, మరాఠీ…
ఇలా అనేక భాషల్లోని సినీ ప్రముఖులు మరణించడం కూడా మనం చూశాం.హీరో హీరోలకు ఫ్యాషన్ డిజైనర్లు గా వ్యవహరించేవారు కూడా మరణించడం మనం చూశాం. ఇప్పుడు మరో సింగర్ మరణించిన వార్త కూడా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బెంగాలీ సింగర్ అయిన నిర్మలా మిశ్రా శనివారం నాడు గుండెపోటుతో మరణించారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె వయస్సు 81 సంవత్సరాలు కావడం గమనార్హం. కొన్నాళ్లుగా తీవ్రమైన అనారోగ్యం తో బాధపడుతూ వస్తున్న మిశ్రా..
శనివారం నాడు దక్షిణ కోల్‌కతాలోని చెట్లా ప్రాంతంలోని తన నివాసంలో మరణించినట్టు స్పష్టమవుతుంది.ఆమె సినీ కెరీర్లో ఎన్నో బెంగాలీ, ఒరియా చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. శనివారం నాడు ఆమెకి తీవ్రమైన గుండెపోటు వచ్చిందట, దీంతో ఆమెను ఓ నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్తున్న సమయంలో ఆమె చివరి శ్వాస విడిచినట్టు స్పష్టమవుతుంది. ఒకవేళ దగ్గర్లో పెద్ద హాస్పిటల్ ఉండి, అక్కడికి సమయానికి తీసుకెళ్లి ఉంటే ఆమె ప్రాణాలు నిలబడేవి అని స్థానికులు చెబుతున్నారు.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?