షూటింగ్ అన్నాక పేకప్.. సినిమా వాళ్ల రిలేషన్ అంటే బ్రేకప్ కామన్ అన్నట్లు తయారైపోయింది పరిస్థితి.. ఏ ఇండస్ట్రీలో చూసినా సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తుల తాలుకు విడాకుల వ్యవహారమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడో ప్రముఖ సింగర్ ఇటీవల బ్రేకప్ చెప్పేసిన తన ప్రేయసి గురించి.. ప్రస్తుతం తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..వివరాల్లోకి వెళ్తే.. పాపులర్ బాలీవుడ్ సింగర్ కమ్ లిరిసిస్ట్ ప్రతీక్ కుహద్ తన ప్రియురాలితో బ్రేకప్ అయిన విషయాన్ని స్పష్టం చేశాడు.
నిహారిక ఠాకూర్‌తో కొంతకాలం లవ్ మేటర్ నడిపాడు ప్రతీక్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నిహారికతో ఉన్న పిక్స్ ఎక్కువగా పోస్ట్ చేసేవాడు. కట్ చేస్తే, కారణాలు ఏంటనేవి తెలియదు కానీ వీళ్లిద్దరూ తమ రిలేషన్ షిప్‌ని కట్టి కబోర్డ్‌లో పడేశారు. కొద్ది రోజుల క్రితమే ప్రతీక్, నిహారిక విడిపోయారు.దీని గురించి రకరకాల వార్తలు వస్తుండడంతో.. ఎట్టకేలకు ప్రతీక్ స్పందించాడు.. ఇటీవలే నిహారికతో బ్రేకప్ అయిందని కన్ఫమ్ చేసేశాడు. ‘‘బ్రేకప్ జరిగిన మాట నిజమే..
నేను ఇప్పటికీ రిలేషన్లో ఉన్నానని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్ లో లేను. కాకపోతే కొద్ది రోజులుగా ఈ విషయాల గురించి మాట్లాడలేదు. దీంతో ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. నేనిప్పుడు ఒంటరిగానే ఉన్నాను. నా ప్రొఫెషన్ మీదనే ఫోకస్ పెట్టాను.. నా చేతిలో చాలా షోస్ ఉన్నాయి.. ఇప్పుడు కూడా మ్యూజిక్ చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు..ఇక ప్రతీక్ కుహద్ ప్రొఫెషన్ విషయానికొస్తే.. ‘కోల్డ్ /మెస్’ అనే సాంగ్ తనకి మంచి ఫేమ్, నేమ్ తీసుకొచ్చింది.
ఎంతలా అంటే.. ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 2019లో తన ఫేవరెట్ మ్యూజిక్ లిస్టులో.. ప్రతీక్ ‘కోల్డ్ /మెస్’ పాటను చేర్చారు. ‘బార్ బార్ దేఖో’ మూవీలో ‘ఖో గయే హమ్ కహాన్’ అలాగే ‘కార్వాన్’ లో ‘సాన్సేన్’ అనే పాటలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..