‘హనుమాన్’ గ్రాఫిక్స్ మాయాజాలం ఘనత హైదరాబాద్ కంపెనీదా?

  • December 2, 2022 / 06:10 PM IST

ప్రశాంత్ వర్మ దర్శత్వంలో రూపు దిద్దుకుంటున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “హనుమాన్” (Hanu-Man) టీజర్ జాతీయ స్థాయిలో మాత్రమే కాదు… అంతర్జాతీయ స్థాయిలో అదరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని “వి.ఎఫ్.ఎక్స్” (VFX) అందుకు కారణం. హాలీవుడ్ స్టాండర్డ్స్ ను తలదన్నేలా “అద్భుతః” అనిపిస్తున్న ఈ గ్రాఫిక్స్ అద్దింది హైదరాబాద్ కు చెందిన “హేలో హ్యూస్ స్టూడియోస్” (Halo Hues Studios) అనే సంస్థ కావడం అందరి ఆశ్చర్యపరుస్తోంది.

తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను (Get-up Srinu) ముఖ్య తారాగణంగా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)తో కలిసి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎన్.ఆర్.ఐ (NRI) కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

అంజనాద్రి (Anjanadri) అనే ఒక ఊహాలోకంలో జరిగే సూపర్ హీరో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతోపాటు… తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ యమ క్రేజీ చిత్రం తెలుగు – హిందీ డిజిటల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు జీ నెట్ వర్క్ సొంతం చేసుకుని ఉండడం విశేషం. వి.ఎఫ్.ఎక్స్ (VFX) కు ప్రాధాన్యత కలిగిన చిత్రాలు నిర్మించే పనిలో ఉన్న దర్శకులందరూ హైదరాబాద్ లోనే ఉన్న గ్రాఫిక్స్ కంపెనీ గురించి ఆరాలు తీయడం తధ్యం!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus