సందీప్ కిషన్ సిక్స్‌ప్యాక్ వెనుక కథ…!

  • September 1, 2020 / 05:58 PM IST

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. ఇందులో హాకీ ప్లేయర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. సినిమాలో క్యారెక్టర్ కోసం సందీప్ సిక్స్ ప్యాక్ చేశాడు. సెప్టెంబర్ 1 నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తున్న సందర్భంగా సిక్స్ ప్యాక్ స్టిల్ రిలీజ్ చేశాడు. ఈ ఫిజిక్ వెనుక ఒక చిన్నకథ ఉంది. అదేంటో తెలుసా? జనవరిలో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు సందీప్ కిషన్ 96 కిలోల బరువు ఉండేవాడు. అక్కడ నుండి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ముందు మార్చిలో 76 కిలోలకు వచ్చాడు.

మధ్యలో అతడిని ఫేమస్ ఫిట్‌నెస్ ట్రయినర్ కులదీప్ సేథీ ట్రైన్ చేశాడు. ప్రొఫెషనల్ హాకీ ప్లేయర్‌లా మజిల్డ్ ఫిజిక్‌తో కనిపించాలని ఉందని కులదీప్‌తో సందీప్ అంటే “మూడు నెలల్లో అటువంటి లుక్ రావాలంటే కష్టం. నువ్వు నరకం చూడాల్సి ఉంటుంది” అన్నాడట. నరకానికి సిద్ధపడిన సందీప్ ఈ లుక్‌లోకి వచ్చాడు. దీని కోసం ప్రతిరోజూ జిమ్‌లో గంటలు కష్టపడ్డాడని కులదీప్ అన్నాడు.

లాక్‌డౌన్‌లో వెయిట్ పెరగకుండా సందీప్ మైంటైన్ చేశాడట. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ కోసం సందీప్ కిషన్‌ని టార్చర్ చేస్తానని కులదీప్ అంటున్నాడు. స్ట్రిక్ట్ డైట్, ఇంటెన్స్ వర్కవుట్ సెషన్స్ తప్పవని హీరోకి అతడు చెప్పాడు.

1

2

3

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus