నెల క్రితం ఆన్ లైన్ లో విడుదలైన రాంగోపాల్ వర్మ ‘జి.ఎస్.టీ’కి సుబ్బిరామిరెడ్డికి సంబంధం ఏమిటి? అనుకొంటున్నారా. కొంపదీసి ఆ పోర్న్ ఫిలిమ్ కి సుబ్బిరామిరెడ్డి ప్రొడ్యూసరా ఏంటీ అని కంగారు అస్సలు పడకండి. ఇక్కడ కళాబంధు సుబ్బిరామిరెడ్డిగారికి “జి.ఎస్.టి”తో డైరెక్ట్ గా ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఇండైరెక్ట్ గా మాత్రం ఆయన చాలా డీప్ గా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ విషయం ఆయనకి తెలియకపోవచ్చు కూడా.
ఇంతకీ విషయం ఏంటంటే.. వర్మ “జి.ఎస్.టి” డాక్యుమెంటరీని హైద్రాబాద్ లోనే తీశాడని కొందరు గొడవలు చేస్తూ టీవీలకెక్కుతున్న విషయం తెలిసిందే. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ డాక్యుమెంటరీ హైద్రాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిందట. ఈ హోటల్ ఓనర్ మరెవరో కాదు మన కళాబంధు సుబ్బిరామిరెడ్డిగారు. అసలు ఆ షూట్ జరిగిన విషయమైనా ఆయనకి తెలుసునో లేదో కానీ.. ఇప్పుడు ఆయన హోటల్ ఇలా వార్తల్లోకెక్కేసరికి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారట సుబ్బిరామిరెడ్డి. నిన్నటివరకూ అందరూ లైట్ తీసుకొన్న ఈ ఇష్యూ ఇప్పుడు సీరియస్ అయ్యింది. ఏకంగా మినిస్టర్ లెవల్ వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారట.
చూస్తుంటే.. ఈ జీయస్టీ ఇష్యూ చిలికి చిలికి గాలివాన అయిన రీతిలో పెద్ద రభసలా తయారయ్యేలా ఉంది. ఇందులో ఇంకెందరు ఇన్వాల్వ్ అయ్యారో తెలియాలంటే పోలీసులు కాస్త సీరియస్ గా ఇన్వాల్వ్ అవ్వాల్సిందే.