Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘ట్రాలాల మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థని స్థాపించి ‘శుభం'(Subham) అనే ఓ చిన్న సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే.  ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా 2025 మే 9న రిలీజ్ అయ్యింది.

Subham Collections

గవిరెడ్డి శ్రీనివాస వంటి వారు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. సమంత కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ కి ఓ కొత్త రకం ఫీల్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా బాగానే పెర్ఫార్మ్ చేసింది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 1.23 cr
సీడెడ్ 0.36 cr
ఆంధ్ర(టోటల్) 1.26 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.85 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.32 cr
ఓవర్సీస్ 0.65 cr
వరల్డ్ వైడ్(టోటల్) 3.82 cr

‘శుభం’ చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ రావడంతో మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుంది. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.3.82 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.7.3 కోట్ల వరకు కొల్లగొట్టింది. బయ్యర్స్ కి రూ.1.32 కోట్ల లాభాలు అందించి డీసెంట్ హిట్ అనిపించుకుంది.

వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus