సుధీర్ బాబు సరసన వెంకీ స్టూడెంట్
- August 31, 2017 / 06:01 AM ISTByFilmy Focus
“గురు, శివలింగ” వంటి సినిమాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకొన్న బాక్సర్ టర్నడ్ యాక్టర్ రితికా సింగ్ కొంత విరామం అనంతరం మరో తెలుగు సినిమా సైన్ చేసింది. సుధీర్ బాబు కథానాయకుడిగా రాజశేఖర్ అనే యువ దర్శకుడు తెరకెక్కించనున్న ఓ డిఫరెంట్ లవ్ స్టోరీలో కథానాయికగా రితికా సింగ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. నిజానికి రితికా తెలుగులో సినిమాలు చేయకపోయినా.. తమిళనాట ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులోనూ చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ.. గ్లామర్ రోల్స్ చేయడం ఇష్టం లేకపోవడంతో.. అర్జంట్ గా డబ్బులు సంపాదించేయాలన్న ఆలోచన కూడా అమ్మడికి లేకపోవడంతో.. తనకు నచ్చిన కథలు, తనకు యాక్టింగ్ కి మంచి స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకొంటుందట.
“శమంతకమణి”తో డీసెంట్ హిట్ అందుకొన్న సుధీర్ బాబు కూడా ఇకపై రెగ్యులర్ మాస్ మసాలా చిత్రాల్లో కాకుండా కాన్సెప్ట్ మూవీస్ లో నటించాలని ఫిక్స్ అయ్యాడట. సో, సుధీర్ బాబు అండ్ రితికా సింగ్ ఎంతో ఇష్టపడి సెలక్ట్ చేసుకొన్న ఈ స్క్రిప్ట్ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది? ఇంతకీ ఎలాంటి సినిమా? అనే విషయాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














