టాలీవుడ్లో ఫిట్‌నెస్‌కు విలువ ఇచ్చే హీరోల్లో సుధీర్‌బాబు ఒకరు. తొలినాళ్లలో సగటు కథానాయకుడిలా కనిపించినా… ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి తన ప్రత్యేకత ఏంటో చూపించారు. ఆయన శరీరమే… బాలీవుడ్లో కూడా ఛాన్స్ ఇప్పించింది అంటే అతిశయోక్తి కాదేమో. సిక్స్‌ప్యాక్‌లు అలవోకగా చేసేస్తుంటాడు. అందుకే సుధీర్‌బాబు ఎక్కడకు వెళ్లినా అతని ఫిట్నెస్ గురించే అడుగుతుంటారు. తాజాగా దీనిపై సుధీర్‌బాబు కొత్తగా స్పందించాడు. నేను ఎక్కడికెళ్లినా… అక్కడివాళ్లు నా ఫిట్నెస్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు అని అన్నాడు సుధీర్‌బాబు.
అంతేకాదు అలా అడగడం వల్ల తనకు బాగా చిరాకొస్తోందట. తన ఫిట్నెస్ గురించి మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారనిపిస్తోందట. అందుకే సంవత్సరం వరకు ఫిట్నెస్ను ఇక ఫాలో అవ్వకూడదని నిర్ణయించా… అంతే కాదు ఆ విషయాన్ని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పాలని అనుకుంటున్నా… అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు సుధీర్‌బాబు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితాన్ని సినిమాగా చూపించాలని చాలా రోజుల నుండి సుధీర్‌బాబు అనుకుంటున్నాడు. ఆ విషయంపైనా స్పందించాడు.
చాలా రోజుల క్రితమే అనుకున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోంది. గోపీచంద్‌ని ప్లేయర్‌గా, కోచ్‌గా ఒకే సినిమాలో చూపిస్తాం. తొలుత అయితే రెండు భాగాలుగా తీద్దాం అనుకున్నాం. కొత్త ఆలోచన ప్రకారం వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయని సుధీర్‌బాబు చెప్పాడు.