Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రం!

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రం!

  • May 24, 2019 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రం!

జబర్దస్త్, ఢీ, పోవే పోరా వంటి సూపర్ హిట్ టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్‌హీరోగా,’రాజు గారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానేర్‌ పై ప్రొడక్షన్‌ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను జులై చివరి వారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ – ”అందరూ నన్ను హీరో అంటున్నారు.. కానీ ఈ సినిమాకు కథే హీరో. దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే చాలా ఎక్సయిటింగ్‌ గా అనిపించింది. ఇప్పటి వరకూ ఆడియన్స్‌ నన్ను తమ పక్కింటి కుర్రాడిగానే పరిగణిస్తారు. ఇంత తక్కువ టైంలోనే వారి ఆదరాభిమానాలు పొందడం నిజంగా నా అదృష్టం. అలాంటిది ఈ సినిమా ద్వారా వారికి మరింత దగ్గర అయ్యే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాకే ఇంత మంది ప్రముఖ టెక్నిషియన్స్‌తో కలిసి పని చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌” అన్నారు.

ప్రొడ్యూసర్‌ కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ – ”నేను గత 11 సంవత్సరాలుగా యుపీవిసి వ్యాపార రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాను. సినిమా మీద ఉన్న ఫ్యాషన్‌తో మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో 6 నెలల క్రితం రాజశేఖర్‌ రెడ్డి నాకు మంచి కథ వినిపించారు. అలాగే ఆయన కోన వెంకట్‌గారి దగ్గర రైటర్‌గాను, హరీష్‌ శంకర్‌, సంపత్‌ నంది దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవం ఉండడంతో రాజశేఖర్‌ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ స్థాపించి ప్రొడక్షన్‌ నెం-1గా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ సినిమాను నిర్మిస్తున్నాను. ఈ సినిమా ద్వారా సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సినిమా అయినా ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో ధన్యా బాలకృష్ణ, ఇంద్రజ, పోసాని, షాయాజీ షిండే, శివ ప్రసాద్‌ లాంటి నటీనటులతో గౌతమ్‌ రాజు, రామ్‌ప్రసాద్‌, రామ్‌ లక్ష్మణ్‌, భీమ్స్‌, శేఖర్‌ మాస్టర్‌ లాంటి ప్రముఖ టెక్నీషియన్స్‌ ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. ఇప్పటికే యాభై శాతం టాకీ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను జులై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం” అన్నారు.

దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ – ”మంచి కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కామెడీతో పాటు కమర్షియల్‌ పంథాలో సాగే ఒక ఇంట్రెస్టింగ్‌ స్టోరీతో మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేటి తరం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీవితాల్లో ఉండే కష్టసుఖాలు మా సినిమాలో చూపించడం జరిగింది. మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న హీరో కాబట్టి సుధీర్‌ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. అలాగే ‘రాజు గారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. రెండు పాటలు చిత్రీకరణ పూర్తయ్యింది. మిగతా రెండు మోంటేజ్‌ సాంగ్స్‌. భీమ్స్‌ అద్భుతమైన సంగీతంతో పాటు అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇస్తున్నారు. అలాగే రామ్‌ప్రసాద్‌గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీ. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రం అవుతుంది” అన్నారు.

ప్రముఖ నటి ఇంద్రజ మాట్లాడుతూ – ”దర్శకుడు చెప్పిన సబ్జెక్ట్‌ నాకు బాగా నచ్చింది. అంతకు మించి ఒక మదర్‌ సెంటిమెంట్‌ నన్ను ఈ క్యారెక్టర్‌ చేయడానికి ప్రేరేపించింది. అలాగే దర్శకుడు కూడా సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. సుధీర్‌ కామెడీ టైమింగ్‌ గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా తన బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇస్తున్నారు. ఈ సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంది. షూటింగ్‌ చాలా ఫన్‌గా జరుగుతోంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dhanya balakrishna
  • #Jabardast Comedy Show
  • #Software Sudheer movie
  • #Sudigali Sudheer

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

14 mins ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

42 mins ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

3 hours ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

56 mins ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

3 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

16 hours ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

17 hours ago
Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version