Suhas: సుహాస్ ఇకనైనా జాగ్రత్త పడాలి.. లేదంటే..!

యూట్యూబ్ లో పలు కామెడీ స్కిట్స్ తో పాపులర్ అయ్యాడు సుహాస్. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ బిజీ అయ్యాడు. ‘హిట్ 2’ లో చేసిన విలన్ రోల్ బాగా క్లిక్ అయ్యింది. ‘ప్రతిరోజూ పండగే’ ‘డియర్ కామ్రేడ్’ ‘మజిలీ’ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాల్లో చేసిన ఫ్రెండ్ రోల్స్ కూడా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో ‘కలర్ ఫోటో’ సినిమాలో హీరోగా చేసే ఛాన్స్ లభించింది.

Suhas

ఆ తర్వాత ‘రైటర్ పద్మభూషణ్’ ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు’ వంటి సినిమాల్లో కూడా అవకాశాలు పొందాడు. అవి కూడా బాగానే ఆడాయి. ‘ప్రసన్నవదనం’ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ రాంగ్ టైం రిలీజ్ వల్ల సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.అయితే సుహాస్ సినిమా అంటే కంటెంట్ ఉంటుంది అనే నమ్మకం మాత్రం పోలేదు.

కానీ ఆ తర్వాత వచ్చిన ‘జనక అయితే గనక’ ‘గొర్రె పురాణం’ వంటి సినిమాలు సుహాస్ కంటెంట్ సెలక్షన్ పై డౌట్ వచ్చేలా చేశాయి. ఇటీవల వచ్చిన ‘ఉప్పుకప్పురంబు’ ‘ఓ భామ అయ్యో రామా’ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. సుహాస్ కంటెంట్ అండ్ రోల్స్ సెలక్షన్ పై కూడా అనుమానాలు రేకెత్తించాయి.

థియేట్రికల్ బిజినెస్ పరంగా సుహాస్ చాలా పూర్. ‘ఓ భామ అయ్యో రామా’ సినిమా మొదటి రోజు ఒక్క షో కూడా ఫుల్ కాలేదు అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సుహాస్ ఇప్పుడే జాగ్రత్త పడాలి. లేదు ‘ఫ్యూచర్ నాని’ అంటూ సుకుమార్ వంటి పెద్ద దర్శకులు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా వేస్ట్ అయిపోతాయి.

నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags