Sukumar: పుష్ప ది రూల్ కోసం సుకుమార్ పడుతున్న కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

  • April 12, 2024 / 04:21 PM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)  పుష్ప ది రూల్ (Pushpa2) సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించాలని డెడ్ లైన్లు విధించుకుని మరీ ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. పుష్ప ది రూల్ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని ఎన్నో వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు సుకుమార్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలుస్తోంది. సుకుమార్ రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నారని భోగట్టా. పుష్ప ది రూల్ కోసం సుకుమార్ పడుతున్న కష్టానికి ఫిదా అవ్వాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఈ సినిమా కోసం మూడు టీమ్స్ పని చేస్తున్నాయని తెలుస్తోంది. జులై చివరి నాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తి చేసి ఆగష్టు మొదటి వారం నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారని భోగట్టా. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మరోసారి మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పుష్ప ది రూల్ సినిమా సక్సెస్ సాధించడం రష్మిక కెరీర్ కు కూడా కీలకం అనే సంగతి తెలిసిందే.

బన్నీ (Allu Arjun), రష్మిక (Rashmika) కాంబినేషన్ అదుర్స్ అనిపిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పుష్ప2 సినిమాలో శ్రీవల్లి పాత్ర చుట్టూ వచ్చే ట్విస్టులు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ ను రూల్ చేయాలని బన్నీ ఫీలవుతున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ (Trivikram) సినిమాతో బిజీ కానున్నారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన జులాయి (Julayi) , సన్నాఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy) , అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి.

పుష్ప2 మూవీ బడ్జెట్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. పుష్ప ది రూల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా రిలీజ్ సమయానికి ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగేలా మేకర్స్ ప్లాన్ ఉందని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus