Love Guru Review in Telugu: లవ్‌ గురు సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 11, 2024 / 05:06 PM IST

Cast & Crew

  • విజయ్ ఆంటోనీ (Hero)
  • మృణాళిని రవి (Heroine)
  • వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు (Cast)
  • వినాయక్ వైద్యనాథన్ (Director)
  • మీరా విజయ్ ఆంటోని (Producer)
  • భరత్ ధనశేఖర్ (Music)
  • ఫరూక్ జే బాష (Cinematography)
  • Release Date : ఏప్రిల్ 11, 2024

ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో లవ్ గురు కూడా ఒకటి. తమిళ ఆల్ రౌండర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా తెరకెక్కిన రోమియో చిత్రాన్ని, తెలుగులో లవ్ గురు పేరుతో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంత మేర మెప్పించింది అనేది ఒక లుక్కేద్దాం రండి:

కథ: అరవింద్ (విజయ్ ఆంటోనీ) మలేషియాలో జాబ్ చేస్తూ ఉంటాడు. అతనికి 35 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. దీంతో సహజంగానే తల్లిదండ్రులు అతని పై ఒత్తిడి చేస్తారు. వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా… తన మనసులో ప్రేమ పుట్టించే అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటానని వాళ్ళతో గట్టిగా చెబుతాడు అరవింద్. అయితే అనుకోకుండా అతను ఇండియా వస్తాడు. ఈ క్రమంలో అతను ఓ చావు ఇంటికి పలకరింపుకి వెళ్తే అక్కడ లీలా (మృణాళిని రవి)ని (Mirnalini Ravi) చూసి తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకుని వందేళ్లు ఆమెతో కలిసి జీవించాలని కోరుకుంటాడు. మొత్తానికి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు.

కానీ ఆమెకు హీరోయిన్ అవ్వాలనేది డ్రీం. ఇది తెలుసుకోకుండా ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసారు అని అరవింద్ వద్ద చెబుతుంది. అంతేకాదు విడాకులు తీసుకుందామని కూడా వేడుకుంటుంది. దీంతో అరవింద్ ఆమె ప్రేమను పొందడానికి అతనే ప్రొడ్యూసర్ గా మారి ఆమెను హీరోయిన్ ను చేయాలనుకుంటాడు. అప్పుడు అతనికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: విజయ్ ఆంటోనీ ఎప్పుడూ సెటిల్డ్ గా కనిపిస్తూ ఉంటారు. అలాంటి పాత్రలే ఇప్పటివరకు ఆయన ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మొదటిసారి తన స్టైల్ కి భిన్నమైన పాత్రను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో కొంచెం కామెడీని కూడా పండించే ప్రయత్నం చేశారు. లుక్స్ పరంగా కూడా ఇది తన ఏజ్ కి సూట్ అయ్యే పాత్ర అని చెప్పొచ్చు. ఇక లీల పాత్రలో మృణాళిని రవి కూడా బాగానే నటించింది.

ఇక సీనియర్ నటి సుద (Sudha) చాలా కాలం తర్వాత ఈ సినిమాలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో అలరించారు. ఇక యోగి బాబు(Yogi Babu) , బీస్ట్ ఫేమ్ వి టి వి గణేష్ (VTV Ganesh) కూడా తమ మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించి పర్వాలేదు అనిపిస్తారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: భర్తని ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్న భార్య, ఆమె ప్రేమను పొందడానికి హీరో చేసే పనులు .. ఇదే లైన్ ప్రధానంగా చాలా సినిమాలు వచ్చాయి. అయితే భాషతో సంబంధం లేవకుండా అందరికీ రబ్ నే బనాది జోడీ గుర్తుకొస్తుంది అనడంలో అతిసయోక్తి లేదు. ఈ లవ్ గురు లైన్ కూడా సిమిలర్ గా అనిపించే అవకాశాలు ఉన్నాయి. కానీ కామిడీ, క్లైమాక్స్ బాగా వర్కవుట్ అయ్యింది అని చెప్పాలి.

ఫస్ట్ హాఫ్ అలా వెళ్లిపోయినా సెకండ్ హాఫ్ అలరించే విధంగా ఉంది అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకి తగ్గట్టుగా కరెక్ట్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ ఇలా అన్ని రకాలుగా ఈ సినిమా టెక్నికల్ గా మెప్పిస్తుంది అని చెప్పొచ్చు.

విశ్లేషణ: ‘లవ్ గురు’ టార్గెటెడ్ ఆడియన్స్ ను తప్పకుండా మెప్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ వీకెండ్ కి థియేటర్లలో హ్యాపీగా ట్రై చేయతగ్గ సినిమా అనడంలో అతిశయోక్తి లేదు.

రేటింగ్: 2.75/5

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus