సినిమా ప్రారంభించడానికి ఎంత ఆలస్యం చేస్తే అన్ని ఎక్కువ పుకార్లు వస్తాయి. వాటిని ఖండించడానికి, క్లారిటీలు ఇచ్చుకోవడానికి ఆ ప్రొడక్షన్ హౌస్, దర్శకుడు ఓ మనిషిని ప్రత్యేకంగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏమీ చెప్పకపోతే ఏదో ఒకటి అనుకోవడం మన నెటిజన్లకు, సినిమా ప్రేమికులకు బాగా అలవాటు. అలాంటి ఇబ్బందులు పడుతున్న సినిమాల్లో ‘పుష్ప 2’ ఒకటి. ‘పుష్ప 1’ వచ్చి ఏడు నెలలు అయిపోయినా ‘పుష్ప 2’ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దీంతో కొత్త పుకార్లు పుట్టుకొస్తున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మూడు పుకార్లు రీసెంట్‌గా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి హీరో గురించి. ఈ పుకారు ఇంతకుముందే వినిపించినా, మళ్లీ మొదలైంది. మరొకటి మాత్రం హీరోయిన్ గురించి. ముందుగా ఆ పుకార్లు ఏంటో చూద్దాం. తర్వాత అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో చూద్దాం. ఈ సినిమాలో అల్లు అర్జున్ 50 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. దీనిపై చిత్రబృందం నుండి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా అయితే సినిమాలో శ్రీవల్లి పాత్రను చంపేస్తున్నారని టాక్.
సినిమా సెకండాఫ్‌ను మంచి ఇంట్రెస్టింగ్ నడిపించడానికి, మాస్ ఆడియన్స్ కోసం కాస్త రొమాన్స్ పాళ్లు కలపడానికి ఓ హీరోయిన్ కావాలి. దాని కోసమే శ్రీవల్లి పాత్రను సినిమా ప్రారంభంలోనే క్లోజ్ చేస్తున్నారని సమాచారం. ఆ తర్వాత సినిమాలోకి మరో హీరోయిన్‌ను ఎంటర్ చేస్తారని చెబుతున్నారు. దాని వల్ల సినిమాకు కొత్త గ్లామర్‌తోపాటు, కుర్రాళ్ల కోసం రొమాన్స్ పాళ్లు కూడా కాస్త యాడ్ అవుతాయని అనుకుంటున్నారట.
మరోవైపు ఈ రెండు పుకార్లకు తోడు, ఇంటర్నేషనల్ బ్యాక్‌డ్రాప్ ఒకటి కొత్తగా వినిపిస్తోంది. సినిమా సెకండాఫ్‌లో హీరోను విదేశాలకు తీసుకెళ్తారట. అయితే సినిమా నేపథ్యాన్ని అక్కడికి తీసుకెళ్తారా అనేది డౌటే. మరి లెక్కల మాస్టారూ సుకుమార్ అండ్ టీమ్ ఏం ఆలోచిస్తుంది అనేది తెలియాలి. ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ‘పుష్ప 2’లో రష్మిక పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని ‘పుష్ప 1’ ప్రచారంలో చెప్పిన విషయం మరచిపోకూడదు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!