Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

టాలీవుడ్‌లోనే కాదు మొత్తంగా ఇండియన్‌ సినిమాలో ఇటీవల కాలంలో ఎక్కువ మంది దర్శకులను ఇచ్చిన దర్శకుడు ఎవరు అంటే అప్పట్లో రామ్‌ గోపాల్‌ వర్మ.. ఆ తర్వాత సుకుమార్‌ అనే చెబుతారు. వర్మ దగ్గర వర్క్‌ చేసి బయటకు వచ్చి భారీ విజయాలు అందుకుని, స్టార్ డైరక్టర్‌లు అయిన వారు చాలా మందే ఉన్నారు. అలా సుకుమార్‌ శిష్యులు కూడా సరైన కథలు పట్టుకున బయటకు వచ్చి స్టార్ హీరోలను ఒప్పించి.. సినిమాలు చేస్తున్నారు. అందులో ఇప్పుడు ప్రముఖంగా మట్లాడాల్సిన దర్శకులు ఇద్దరు.

Buchi Babu – Srikanth Odela

మిగిలిన వారు కూడా సినిమాలు చేస్తున్నా స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన, చేయబోతున్న ఆ ఇద్దరి గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అందులో ఒకరు కటింగ్‌ స్పెషలిస్ట్‌ బుచ్చిబాబు సానా అయితే, రెండో వ్యక్తి రక్తపాతం స్పెషలిస్ట్‌ శ్రీకాంత్‌ ఓదెల. ‘ఉప్పెన’తో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సానా రీసెంట్‌గా ‘పెద్ది’ సినిమా చేశారు. ఇక ‘దసరా’ సినిమాత ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్‌ ఓదెల ఇప్పుడు ‘ప్యారడైజ్‌’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు.

ఈ క్రమంలో ఓ పోలిక బాగా హైలైట్‌ అవుతోంది. అదే హీరో, అతని వర్గం ఉనికి కోసం చేసే పోరాటం. కావాలంటే రీసెంట్‌ సుకుమార్‌ శిష్య బృందం నుండి వచ్చిన వారి కథలు చూడండి.. ఎప్పుడూ ఎవరో ఒకరితో తమ ఉనికి కోసం పోరాడుతూనే ఉంటారు. ఈ క్రమంలో ఘర్షణ, మాస్‌ ఎలివేషన్లు బాగా వస్తాయనో లేక ఇంకే కారణమో కానీ ఈ పోరాటం మీద ఉన్న ఆరాటంతో ఇతర కథ, స్క్రీన్‌ప్లే, సన్నివేశాలు లాంటివి పక్కన పెట్టేస్తున్నారు.

‘పెద్ది’లో కానీ, ‘ప్యారడైజ్‌’లో కానీ, ‘దసరా’లో కానీ.. ఇలా ఎక్కడ చూసినా ఇదే పాయింట్‌ క్లియర్‌గా ఉంటుంది. దీంతో ఒకే పాయింట్‌ చుట్టూ వేర్వేరు పాత్రలు, నేపథ్యాలు పట్టుకుని సినిమాల రాసేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడో విషయం చెప్పుకోవాలి వాళ్ల గురువు సుకుమార్‌ సినిమాలు కూడా ఇంచుమించు ఇంతే. కానీ ఆయన ఎక్కడో మ్యాజిక్‌ చేస్తున్నారు. అందుకే అవి కనిపించడం లేదు. ఈ విషయంలో డౌటా రెండు ‘పుష్ప’లు, ‘రంగస్థలం’.. ఇంకా ఆ ముందు సినిమాల కథల మీద ఓ లుక్కేయండి.

 ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus