Sumanth: నాగార్జున కోసం సుమంత్ అలా చేస్తున్నారా?

Advertisement

అక్కినేని హీరో సుమంత్ కు నటుడిగా మంచి పేరు ఉన్నా ఆయన నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. సుమంత్ గత సినిమా కపటధారి ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రెండు సినిమాలలో సుమంత్ నటిస్తుండగా ఆ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 83 సినిమాలో టైటిల్ రోల్ లో రణవీర్ సింగ్ నటించారు. ఈ సినిమాలో కపిల్ దేవ్ భార్య పాత్రలో దీపికా పదుకొనే నటించారు.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన రిలీజ్ కానుంది. హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా 83 సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ లో హీరో పాత్రకు సుమంత్ డబ్బింగ్ చెబుతున్నారు.

తెలుగులో నాగార్జున ఈ సినిమాను విడుదల చేస్తుండటంతో సుమంత్ ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారని తెలుస్తోంది. 83 సినిమా విడుదలైన రోజునే తెలుగులో శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా రిలీజ్ కానుంది. 83 సినిమా రిలీజ్ వల్ల శ్యామ్ సింగరాయ్ మేకర్స్ టెన్షన్ పడుతున్నారు. భారతీయులకు క్రికెట్ పై ఉండే ఎమోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవర్సీస్ లో కూడా శ్యామ్ సింగరాయ్ కు 83 సినిమా వల్ల ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus