Sumanth, Nagarjuna: ఆ సినిమా చేసి తప్పు చేశానన్న సుమంత్!

  • February 9, 2022 / 10:38 PM IST

నాగార్జున, సుమంత్ హీరోలుగా బాలశేఖరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన స్నేహమంటే ఇదేరా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. భూమిక ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటించగా ప్రత్యూష ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా చేసి తప్పు చేశానని సుమంత్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. నిర్మాతలకు కూడా ఈ సినిమా భారీమొత్తంలో నష్టాలను మిగిల్చింది. ప్రేమకథ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సుమంత్ పదుల సంఖ్యలో సినిమాలలో నటించినా సక్సెస్ రేట్ విషయంలో ఇతర హీరోల కంటే వెనుకబడ్డారు.

Click Here To Watch

ఈ హీరో నటించిన మళ్లీ మొదలైంది జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మళ్లీ రావా సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ లేని సుమంత్ ఈ సినిమాతోనైనా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా ఫ్రెండ్స్ అనే సినిమాకు రీమేక్ గా స్నేహమంటే ఇదేరా సినిమా తెరకెక్కింది. రియల్ లైఫ్ లో మామాఅల్లుళ్లు అయిన తమను దర్శకుడు ఫ్రెండ్స్ లా చూపించడం వల్ల స్నేహమంటే ఇదేరా సినిమా ఫ్లాప్ అయిందని సుమంత్ కామెంట్లు చేశారు.

ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసని ఆయన కామెంట్లు చేశారు. షూటింగ్ సమయంలోనే ఈ సినిమా చేసి తప్పు చేశానని అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అప్పటికే కొంతభాగం షూట్ పూర్తి కావడంతో ఆ సినిమా విషయంలో తాను ఏం చేయలేకపోయానని సుమంత్ తెలిపారు. స్నేహమంటే ఇదేరా సినిమాలో నేను నాగార్జునను కొట్టే సీన్ ఉంటుందని ఆ సీన్ చేసే సమయంలో తాను చాలా బాధ పడ్డానని సుమంత్ వెల్లడించారు.

ప్రేక్క్షకులకు కూడా ఆ సీన్ నచ్చలేదని సుమంత్ పేర్కొన్నారు. సుమంత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళంలో విజయ్, సూర్య ఫ్రెండ్స్ రీమేక్ లో నటించగా అక్కడ ఈ సినిమా సక్సెస్ సాధించింది.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus