సుమంత్ కొత్త సినిమా టైటిల్ కి స్టోరీకి సంబంధం లేదే

  • November 19, 2019 / 12:43 PM IST

కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రం “కావలుదారి”. ఇన్వెయిస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ చిత్రం అక్కడ మంచి విజయం సాధించడమే కాక అన్నీ ఇండస్ట్రీలను విశేషంగా ఆకర్షించింది. అందుకే ఆ చిత్రాన్ని తెలుగులో సుమంత్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. “బేతాళుడు” ఫేమ్ ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందిత కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను నిన్న విడుదల చేశారు.

కన్నడలో “కావలుదారి” అయిన టైటిల్ తెలుగులో “కపటధారి”గా మారింది. కావలుదారి అంటే రక్షకుడు అని అర్ధం.. కానీ కపటధారి అంటే కపటమైన వ్యక్తిత్వం కలవాడు అని అర్ధం వస్తుంది. మరి సినిమా కాన్సెప్ట్ తో టైటిల్ కి ఎలా సింక్ అయ్యింది అనేది దర్శకుడికే తెలియాలి. దర్శకుడి ప్రతిభ చాటుకోవడానికి భీభత్సమైన స్కోప్ ఉన్న ఈ చిత్రాన్ని సుమంత్ ఎలా యూటిలైజ్ చేసుకొంటాడు అనేది చూడాలి.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus