Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సుప్రీమ్ హీరో సాయితేజ్ చేతుల మీదుగా విడుదలైన ‘సుందరం మాస్టర్’ టీజర్

సుప్రీమ్ హీరో సాయితేజ్ చేతుల మీదుగా విడుదలైన ‘సుందరం మాస్టర్’ టీజర్

  • July 11, 2023 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుప్రీమ్ హీరో సాయితేజ్ చేతుల మీదుగా విడుదలైన ‘సుందరం మాస్టర్’ టీజర్

హ‌ర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్ర‌ధాన తారాగ‌ణంగా ఆర్‌.టి.టీమ్ వ‌ర్క్స్‌, గోల్ డెన్ మీడియా బ్యాన‌ర్స్‌పై క‌ళ్యాణ్ సంతోష్ దర్శ‌క‌త్వంలో ర‌వితేజ‌, సుధీర్ కుమార్ కుర్రు నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం ‘సుందరం మాస్టార్’. సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథే ఇది. తను గవర్నమెంట్ టీజర్. సోషల్ స్టడీస్ బోధిస్తుంటాడు. అయితే మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అందులో అన్నీ వ‌య‌సుల‌వారు ఇంగ్లీష్ నేర్చుకోవ‌టానికి విద్యార్థులుగా వ‌స్తారు. మ‌రి సుంద‌రం మాస్టార్ వారికెలా ఇంగ్లీష్‌ను బోధించారు అనే విష‌యం ఎంట‌ర్‌టైనింగ్‌గా రూపొందించిన చిత్ర‌మే ఇది. ఈ సినిమా టీజ‌ర్‌ను సుప్రీమ్ హీరో సాయితేజ్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం వైజాగ్‌లో జ‌రిగింది. ఈ కార్యక్రమంలో…

సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ ‘‘సుందరం మాస్టర్ టీజర్ రిలీజ్ చేయటానికి ఐదు కార‌ణాలు, అక్ష‌ర‌, ర‌మ‌గారు, రావుగారు మొద‌టి మూడు కార‌ణాలు. హ‌ర్ష వాళ్ల‌బ్బాయే. త‌ను బాగా న‌టిస్తాడు. ఇంకా మంచి స్థాయికి చేరుకుంటాడ‌ని ఆశిస్తున్నా వాళ్ల‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఇక నాలుగో కార‌ణం.. నా ఫేవ‌రెట్ హీరో ర‌వితేజ‌గారు. ఆయ‌న నాకు చాలా చిన్న చిన్న విలువైన విష‌యాల‌ను నేర్పించారు. ఆయ‌న కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఐదో కార‌ణం.. ప్రేక్ష‌కుల ప్రేమను పొంద‌డానికే వచ్చాను. మా సుంద‌రం మాస్ట‌ర్ టీమ్‌.. డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ సంతోష్‌, సుధీర్ వ‌ర్మ‌గారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్‌గారికి.. అంద‌రికీ మీ ప్రేమ‌ను అందిస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నాను.

హర్ష చెముడు మాట్లాడుతూ ‘‘నేను చాలా మందికి చాలా థాంక్స్. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన శబరీష్‌కి థాంక్స్‌. నా త‌ల్లిదండ్రులు, నా భార్య అంద‌రూ నా బిహేవియ‌ర్‌ను భ‌రించారు. క‌ళ్యాణ్ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు నువ్వే హీరో అన్నాడు. ఊరుకో బాసూ! ఏం మాట్లాడుతున్నావ్ అన్నాను. పూర్తి క‌థ విన్న త‌ర్వాత ఎవ‌రికీ చెప్ప‌కు ఇది నేనే చేస్తాను అని అన్నాను. అంత బాగా ఉంది. వైవా రిలీజ్ అయ్యి 10 ఏళ్లు అవుతుంది. ప‌దేళ్ల ముందు షార్ట్ ఫిల్మ్ వ‌స్తే.. 10 ఏళ్లలో మీరు న‌న్ను ఇక్క‌డ నిలుచో బెట్టారు. క‌ష్ట‌ప‌డితే అంద‌రూ మీ ల‌క్ష్యాల‌ను చేరుకుంటారు. నాకు ఇది చాలా ఎమోష‌న‌ల్ మూమెంట్‌. క‌ళ్యాణ్ స్క్రిప్ట్‌ను బ్యూటీఫుల్‌గా రాస్తే సుధీర్‌గారు, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌గారు అద్భుతంగా నిర్మించారు. ర‌వితేజ‌గారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి.. ఇక్క‌డ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారికి స‌పోర్ట్ అందిస్తున్నారు. మా టీమ సినిమా కోసం ప‌డ్డ క‌ష్టం ముందు నేను న‌థింగ్‌. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. సాయి బ్రో వ‌చ్చి టీజ‌ర్ విడుద‌ల చేసినందుకు థాంక్స్‌’’ అన్నారు.

ప్ర‌శాంత్‌ మాట్లాడుతూ ‘‘హర్ష ఇంజ‌నీరింగ్‌లో మా జూనియ‌ర్‌. అప్ప‌ట్లో ఎవ‌రైనా త‌న‌ను కామెంట్ చేసినా దాన్ని పాజిటివ్‌గానే తీసుకునేవాడు. మ‌న వ‌ల్ల ఒక‌రు న‌వ్వుతున్నారు క‌దా! అని లైట్ తీసుకునేవాడు. ఈరోజు త‌న టాలెంట్‌తో ఇక్క‌డ నిల‌బ‌డ్డాడు. త‌నే కాదు.. ఎవ‌రైనా గ‌ట్టిగా ట్రై చేస్తే మంచి స్టేజ్‌కి వ‌స్తార‌న‌టానికి హ‌ర్ష ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

చిత్ర దర్శకుడు కళ్యాణ్ సంతోష్ మాట్లాడుతూ ‘‘మా ఆర్ట్ డైరెక్ట‌ర్‌, కాస్ట్యూమ్ టీమ్ సినిమాకు ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఇంత బాగా రావ‌టానికి మెయిన్ రీజ‌న్ ముగ్గురు వ్య‌క్తులు. అందులో మొద‌టివాడు హ‌ర్ష‌. మా సినిమాను ర‌వితేజ‌గారు ప్రొడ్యూస్ చేస్తున్నార‌ని చెప్ప‌గానే ముందు న‌మ్మ‌లేదు. త‌ను ప్రామిస్ చేసిన స‌ర్‌ప్రైజ్‌ల‌ను పూర్తి చేశాడు. ఇక సినిమా బాగా రావ‌టానికి కార‌ణ‌మైన వ్య‌క్తుల్లో రెండో వ్య‌క్తి సుధీర్ వ‌ర్మ‌గారు. న‌న్ను న‌మ్మి సుధీర్ వ‌ర్మ‌గారు సినిమాను ఇంత వ‌ర‌కు తీసుకొచ్చారు. ఆయ‌న నా స‌పోర్ట్ సిస్ట‌మ్‌గా నిలిచారు. ఇక సినిమా బాగా రావ‌టానికి మూడో కార‌ణం ర‌వితేజ‌గారు. ప్ర‌తి డైరెక్ట‌ర్ ర‌వితేజ‌గారితో సినిమా చేయాల‌నుకుంటారు. నేను కూడా చేశాను. అయితే ఆయ‌న నిర్మాణంలో సినిమా చేశాను. ఆయ‌న కొత్త వాళ్ల‌తో సినిమా చేస్తూ ఎంక‌రేజ్ చేస్తున్నందుకు ఆయ‌న థాంక్స్‌. ఇక ఇక్క‌డ‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చిన సాయితేజ్‌గారికి థాంక్స్‌. త‌ను చాలా మంచి పాజిటివ్ వ్య‌క్తి. మా సినిమాకు స‌పోర్ట్ చేస్తున్న ఆయ‌న‌కు థాంక్స్‌’’ అన్నారు.

సుధీర్ వ‌ర్మ మాట్లాడుతూ ‘‘హర్ష హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి తెలుసు. తను ఈరోజు కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నాడు. త‌ను ఇంకా గొప్ప స్థానాకి వెళ్లాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

చందు మొండేటి మాట్లాడుతూ ‘‘సుందరం మాస్టర్’ మూవీ టీజ‌ర్ చాలా బావుంది. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. డైరెక్ట‌ర్ సంతోష్‌, నిర్మాత సుధీర్‌ల‌కు ఈ సినిమా హిట్టై చాలా మంచి పేరు వ‌స్తుంది. హ‌ర్ష హార్డ్ వ‌ర్కర్ మాత్ర‌మే కాదు… స్మార్ట్ ప‌ర్స‌న్ కూడా. త‌న‌కు ఈ సినిమా పెద్ద స‌క్సెస్‌గా నిలుస్తుంది’’ అన్నారు.

హీరోయిన్ దివ్య శ్రీపాద మాట్లాడుతూ ‘‘సుంద‌రం మాస్ట‌ర్‌ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు కథ విన్నాను. హర్షకి ఫోన్ చేసి నీకు తగిన మంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌న చెప్పాను. పాజిటివ్ ఎన‌ర్జీతో సినిమాను పూర్తి చేశాం. టీజ‌ర్‌ను మించి సినిమా ఉంటుంది. అంద‌రూ థియేట‌ర్‌లో మూవీని ఎంజాయ్ చేస్తారు. యాక్ట‌ర్‌గా హ‌ర్ష నుంచి చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను’’ అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divya Sripada
  • #Viva Harsha

Also Read

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

related news

trending news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

16 mins ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

59 mins ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

2 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

3 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

4 hours ago

latest news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

1 day ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

1 day ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version