Bigg Boss 7 Telugu: షకీల వెళ్లిపోతుంటే తేజ ఏం చేశాడో తెలుసా ? బ్రేక్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో సండే ఎపిసోడ్ ఫన్ డే అంటూ మొదలవుతుంది. కానీ, ఆడియన్స్ అందరికీ అది బోరింగ్ డే అవుతుంది. ఎందుకంటే, ఎలిమినేషన్ లో కిక్ అనేది ఉండదు. అంతేకాదు, చాలామంది ముందుగానే సోషల్ మీడియా ద్వారా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది తెలుసుకుంటున్నారు. బిగ్ బాస్ లవర్స్ అయితే శనివారం రాత్రే ఈవిషయాన్ని షూటింగ్ అవ్వగానే పట్టేస్తున్నారు. అందుకే, బిగ్ బాస్ టీమ్ ఎలిమినేషన్ రౌండ్ ని లైవ్ లో టెలికాస్ట్ చేస్తే బాగుంటుదని చాలామంది సలహాలు ఇస్తున్నారు. ఈవిషయం పక్కనబెడితే, 2వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచీ షకీల ఎలిమినేట్ అయిపోయింది. చివరకి వరకూ హౌస్ లో అందరూ చాలా సస్పెన్స్ గా ఎలిమినేషన్ ని చూశారు. లాస్ట్ వరకూ టేస్టీ తేజ ఇంకా షకీల ఇద్దరే మిగిలారు. వాళ్లిద్దరిలో ఎవరు వెళ్లిపోతారు అనేది ఆసక్తిగా నడించింది.

బిగ్ బాస్ యాక్టివిటీ రూమ్ లో మాయాస్త్రం వచ్చిన ప్లేస్ లో ఒకరి ఫోటో వచ్చింది. అందులో టేస్టీ తేజ ఫోటో వచ్చేసరికి తేజ సేఫ్ అయ్యాడు. షకీల ఎలిమినేట్ అయ్యిందని నాగార్జున చెప్పాడు. దీంతో తేజ అక్కడిక్కడే కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. తను సేఫ్ అయిన దానికంటే కూడా షకీలమ్మ ఎలిమినేట్ అయినందుకు గార్డెన్ ఏరియాకి వచ్చి బాధపడ్డాడు. అంతేకాదు, షకీలమ్మ నాకు ఎప్పటికీ అమ్మగానే ఉంటుందని, హౌస్ లో నాకు ఇంట్లో అమ్మలేని లోటుని పూర్తి చేసిందని చెప్పాడు.

అలాగే, షకీలమ్మ వెళ్లిపోతుంటే అమర్ , సందీప్, శోభా కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ, ఆ మరుక్షణమే హౌస్ బయట గార్డెన్ లో రైన్ బో కనిపిస్తుంటే దానిని చూస్తూ మైమరిచిపోయారు. ఇక షకీలకి హౌస్ మేట్స్ అందరూ సెండ్ హాఫ్ ఇచ్చారు. షకీల వెళ్లిపోయిన తర్వాత స్మోక్ జోన్ లో కూర్చుని సందీప్ ఇంకా అమర్ ఇద్దరూ తీవ్రంగా ఆలోచించారు. అంతేకాదు, ఇక్కడే స్ట్రాటజీలు కూడా మాట్లాడారు.నిజానికి సందీప్ అంతకుముందు లైవ్ లో గౌతమ్ ఈవారం వెళ్లిపోతాడేమో అని అనుకున్నారు.

స్టేజ్ పైకి వచ్చిన షకీల తన జెర్నీని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఎప్పటిలాగానే పద్దతి ప్రకారం హౌస్ మేట్స్ లోని రంంగుల గురించి చెప్తూ గేమ్ ఆడింది. ప్రియాంక అందరితో ఫ్రెండ్లీ అని, ప్రిన్స్ తనే గొప్పుడు అని ఫీల్ అవుతాడని చెప్పింది. తర్వాత ఆవేశపరుడి రంగుని ప్రశాంత్ కి ఇచ్చింది. నమ్మకస్తులు అనే కలర్ ని థామినికి ఇచ్చింది. అలాగే, రతిక స్టోన్ హార్ట్ అనే రంగు పులిమింది. అలాగే, ఆనందం అనే కలర్ ని శివాజీకి ఇచ్చింది. ఇక నెక్ట్స్ టేస్టీ తేజ షకీల వెళ్లిపోతుంటే నిజంగా ఏడుపు వచ్చేసిందని చెప్పాడు. అలాగే, థామిని అమ్మ పాట పాడి సెండాఫ్ ఇచ్చింది. మొత్తానికి షకీల సీజన్ 7 లో మెరుపులా వచ్చి మాయ చేసి ఆడియన్స్ మనసులు గెలుచుకుందనే చెప్పాలి. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus