నక్షత్రం సినిమా షూటింగ్ లో తొలి రోజే ప్రమాదం జరిగింది. ఇందులో యువ హీరో సందీప్ కిషన్ కి గాయాలు అయ్యాయి. “ఒక్క అమ్మాయి తప్ప” తర్వాత సందీప్ కిషన్ చేస్తున్నసినిమా నక్షత్రం. కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ మగళవారం (జూన్ 14) మొదలయింది. తాను అభిమానించే డైరక్టర్ తో పనిచేసే అవకాశం రావడంతో సంతోషంగా షూటింగ్ కి సందీప్ హాజరయ్యాడు.
మణికొండ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో వేసిన సెట్ లో సందీప్ కథానాయిక రాశీ ఖన్నాను కలిసే సన్నివేశాన్నిచిత్రీకరణ మొదల పెట్టారు. ఆ సమయంలో బాణాసంచా పేల్చారు. అనుకోకుండా క్రాకర్ సందీప్ మొహం పై పేలింది. దీంతో అప్పటికప్పుడు సందీప్ ని ఆస్పత్రికి తరలించారు. చిత్ర బృందం ఆరోజు షూటింగ్ ని క్యాన్సిల్ చేసింది.
ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత “ఎవరూ కంగారు పడవద్దు. ఇప్పుడు నేను బాగున్నాను. మొహం మీద కొన్నికుట్లు పడ్డాయి. అయినా ఆ సీన్ బాగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది” అని నిన్నసందీప్ సోషల్ మీడియాలో వెల్లడించాడు.
Hi guys..much better now,got a few stitches..just an unfortunate accident on Krishna Vamsi sirs set..action sequence..glad it came out well
— Sundeep Kishan (@sundeepkishan) June 15, 2016