యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ లుక్ తాలుకు పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అంతలా వైరల్ అవడానికి ఏముంది అంటే అదేదో రీసెంట్ స్టైలిష్ ఫొటోషూట్ కాదు.. కొత్త సినిమా స్టిల్ అంతకన్నా కాదు.. కొంతగ్యాప్ తర్వాత గుర్తుపట్టడానికి కాస్త టైం తీసుకునేంతగా మారిపోయాడు సందీప్.. వెయిట్ తగ్గి, ముఖం కాస్త పీక్కుకుపోయి షాకింగ్ లుక్‌లో సందీప్ కనిపిస్తున్నాడేంటబ్బా అనుకుంటున్నారంతా.. అసలు విషయం ఏంటంటే.. కెరీర్ స్టార్టింగ్ నుండి రిజల్ట్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఛాలెంజింగ్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ..
తెలుగుతో పాటు తమిళ్లోనూ టాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ ఇప్పుడు ఇంకో ప్రయోగం చేయబోతున్నాడు.. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకుని ‘మైఖేల్’ అనే సాలిడ్ స్క్రిప్ట్ ఫిక్స్ చేసుకుని, క్యారెక్టర్ కోసం ఇలా మారిపోయాడు.. అన్నట్టు సందీప్ కిషన్ కెరీర్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, డైరెక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్, దివ్యాన్ష కౌశిక్, వరలక్ష్మీ శరత్ కుమార్, అయ్యప్ప పి.శర్మ, అనసూయ భరద్వాజ్, వరుణ్ సందేశ్ లాంటి హెవీ స్టార్ట్ కాస్టింగ్ తో..
నారాయణ దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా.. రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.. రెండు వారాల క్రితం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్స్ టీజర్లను పలువురు సెలబ్రిటీలు రిలీజ్ చేశారు.. చెప్పడం కాదు కానీ టీజర్ చూస్తే సందీప్ కిషన్ ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్ ఏంటనేది తెలుస్తుంది.. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ లుక్ ‘మైఖేల్’ మూవీలోనిదే..
సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ ఆలిమ్ హకీం గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. ఈ ఫీల్డులో తనకున్న అనుభవంతో ఎంతోమంది స్టార్లను సరికొత్త రూపంలోకి మార్చారు హకీం.. ఇప్పుడు ‘మైఖేల్’ కోసం సందీప్‌ని స్టైలిష్‌గా, యంగ్‌గా.. ఇంకా చెప్పాలంటే.. ఓ పదేళ్ల ఏజ్ తగ్గించేసి పిల్లాడిలా మార్చేశారు.. ‘ప్రస్థానం’ రోజుల్లో సందీప్ ఇలానే ఉండేవాడు.. కొంత గ్యాప్ తర్వాత తను ఇలా కొత్త లుక్‌లో కనిపించి షాక్ ఇచ్చాడు.. ‘మైఖేల్’ తో మళ్లీ ట్రాక్‌లోకి రాబోతున్నాననే నమ్మకంతో ఉన్నాడు