తన పేరెంట్స్ కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన సందీప్ కిషన్..!

ఈ ఏడాది ‘నిను వీడని నేను’ చిత్రంతో చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నాడు కుర్ర హీరో సందీప్ కిషన్. ఈ సినిమాని స్వయంగా తనే నిర్మించి మరీ హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్ చిత్రంతో కూడా థియేటర్లలో సందడి చేసాడు సందీప్ కిషన్. అయితే ఈ చిత్రం యావరేజ్ గా మాత్రమే నిలిచింది. చాలా కామెడీ ఉన్నప్పటికీ ఈ రోజుల్లో దానిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదన్న సంగతి తెలిసిందే. కథలో భాగంగా వచ్చే కామెడీని మాత్రమే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక దీనిని పక్కన పెడితే.. సందీప్ కిషన్ తాజాగా ఓ బెంజ్ కారుని కొనుగోలు చేశాడు. ‘చాలా కాలం నుండీ తన తల్లితండ్రులకు ఓ కారుని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నట్టు’ సందీప్ కిషన్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు ఇప్పుడు ఓ కారుని తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. బెంజ్ ‘జి.ఎల్.ఇ 350డి’ మోడల్ గల ఈ కారు ఖరీదు అక్షరాలా 75 లక్షలకు పైనే అని తెలుస్తుంది. సందీప్ కిషన్ ఈ కారుని తన పేరెంట్స్ కి గిఫ్ట్ గా అందచేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus