బాలీవుడ్ నటి సన్నీలియోన్ కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ పాప్ ఆల్బమ్స్ తో బాగా బిజీ అయింది. తాజాగా ఈమె కనికా కపూర్ పాడిన పాటలో నటించింది. బుధవారం నాడు ఈ పాటను విడుదల చేశారు. అయితే ఈ పాట చూసిన నెటిజన్లు సన్నీలియోన్ పై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో సన్నీలియోన్ ను బాగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ పాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సాహిత్యం ఉందని.. అలానే సన్నీలియోన్ బోల్డ్ పెర్ఫార్మన్స్ మరింత కించపరిచేలా ఉందని ఆమెపై ఫైర్ అవుతున్నారు. ‘రాధ నర్తకి కాదు.. భక్తురాలు.. మధుబన్ పవిత్ర ప్రదేశం. రాధ మధుబన్ లో ఇలా డ్యాన్స్ చేయలేదు. ఇది సిగ్గుపడే సాహిత్యం’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. దేవుడిని కించపరిచే హక్కు నీకు లేదంటూ సన్నీలియోన్ పై మండిపడుతున్నారు.
హిందూ సంప్రదాయాలు, విలువలు మరింత దిగజారిపోయేలా సినిమా వాళ్లు వ్యవహరిస్తున్నారని.. నీతులు తెరపై చెప్పడం కాదని.. ఆచరణలో పెట్టాలంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఈ పాటను వెంటనే తొలగించి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే పరిణామాలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి సన్నీలియోన్ నటించిన ఈ పాట వివాదాస్పదమవుతోంది. ఈ పాటను షరీబ్ తోషి స్వరపరచగా.. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. సన్నీలియోన్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ పాటపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి.