Sunny Leone: ఆ విషయంలో సన్నీలియోన్ ను మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఏమైందంటే?

మన దేశంలోని సినీ అభిమానులకు సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బోల్డ్ రోల్స్ ఉన్న సినిమాలలో నటించడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు. సన్నీ లియోన్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో సన్నీ లియోన్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మన దేశంలో వినాయక చవితి సంబరాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. సన్నీ లియోన్ విదేశాలలో పుట్టి పెరిగినా భారత సంతతికి చెందిన యువతి అనే సంగతి తెలిసిందే.

తాజాగా సన్నీ లియోన్ గణేష్ చతుర్థి ఉత్సవాలలో పాల్గొన్నారు. తన భర్త డానియల్ వెబర్ తో కలిసి సన్నీ లియోన్ ముంబైలోని లాల్ బాగ్ దగ్గర ఉన్న గణేషుడి మండపానికి వెళ్లి పూజలు చేయడం గమనార్హం. గణేషుని సన్నిధి దగ్గరకు సన్నీ లియోన్ రావడంతో చాలామంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు.

మన దేశ మూలాలు ఉన్న స్త్రీ కావడంతో సన్నీ లియోన్ లో దైవభక్తి ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు సన్నీ లియోన్ ను ఎంతగానో ప్రశంసిస్తున్నారు. సన్నీ లియోన్ బోల్డ్ రోల్స్ లో నటించడం గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను చేసిన తప్పుల వల్ల ఇప్పుడు కొన్నిచోట్ల తల దించుకున్నానని ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఎంతైనా భారతీయ మూలాలు ఉండటం వల్ల నేను ఇలా ఆలోచిస్తున్నానేమో అని సన్నీ లియోన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సన్నీ లియోన్ ఇకపై బోల్డ్ రోల్స్ కు దూరంగా ఉంటే బాగుంటుందని కామెంట్లు చేశారు. సన్నీ లియోన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో సన్నీ లియోన్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని మంచి రోల్స్ లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus