Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

అర్జున్ దాస్, శాండీ మాస్టర్ కలిసి నటిస్తున్న చిత్రం ‘సూపర్ హీరో బాబు’. తమిళంలో ‘సూపర్ హీరో’ పేరుతో రూపొందుతోంది ఈ చిత్రం.కె.ఎస్. సినిష్ ‘సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ సంస్థపై ‘రెడాక్టెడ్ స్టూడియోస్’ శంజన్ జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా ‘సూపర్ హీరో బాబు’(Super Hero Babu) రూపొందుతోంది. ‘బెలూన్’ ఫేమ్ కె.ఎస్. సినిష్ ‘డిక్కిలూనా’… ‘పార్కింగ్’తో నిర్మాతగానూ మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా సినిష్ తన సక్సెస్ స్ట్రీక్ ను కొనసాగిస్తున్నారు.

Super Hero Babu

ఇక అర్జున్ దాస్‌కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ‘ఓజి’ తో అది రెట్టింపు అయ్యింది. దీంతో ‘సూపర్ హీరో బాబు పై తెలుగులో మంచి సక్సెస్ అవుతుందని మేకర్స్ ఆశపడుతున్నారు. హీరోయిన్ తేజు అశ్విని, అర్జున్ దాస్ సీన్స్ ఈ మూవీకి హైలెట్ గా నిలుస్తాయట. మరో వైపు శాండీ మాస్టర్ కూడా ‘లోక చాప్టర్ 1’ ‘కిష్కిందపురి’ చిత్రాలతో తెలుగులో పాపులర్ అయ్యారు. అర్జున్ దాస్, శాండీ మాస్టర్ కాంబో ఈ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ కానుందట.

విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు. బెలూన్’ ఫేమ్ కె.ఎస్. సినీష్ వద్ద అతను సహాయ దర్శకుడిగా  పనిచేశాడు. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ అయిన కార్తీక్ యోగి (డిక్కిలూనా), రామ్ (పార్కింగ్)ని సినిష్ తెరకు పరిచయం చేశారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడు విఘ్నేష్‌ను పరిచయం చేయబోతోన్నారు.హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అతని మ్యూజిక్ కూడా సినిమాకి హెల్ప్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus