ఏ.ఎం.బి సినిమాస్ లో అభిమానుల కోసం ఏర్పాటు

  • February 6, 2019 / 10:37 AM IST

హెడ్డింగ్ చూసి “ఇదేంటి అప్పుడే మహేష్ బాబుకి విగ్రహం కూడా పెట్టేస్తున్నారా?” అని కంక్లూజన్స్ కి వచ్చేయకండి. ఇక్కడ మేటర్ ఏంటంటే.. అప్పుడెప్పుడో మహేష్ బాబు వాక్స్ స్టేట్యూని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సింగపూర్ లో ఆ వ్యాక్స్ విగ్రహాన్ని పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ విగ్రహం కూడా పూర్తయ్యింది. అయితే.. అక్కడెక్కడో సింగపూర్ లో ఉన్న వ్యాక్స్ స్టేట్యూను చూడడం కోసం మహేష్ బాబు అభిమానులు వెళ్లలేరు కాబట్టి.. మహేష్ సతీమణి నమ్రత ఒక స్పెషల్ సెటప్ చేసింది.

ఏంటంటే.. మహేష్ బాబు స్టేట్యూను సింగపూర్ లో ప్రారంభించడం కంటే ముందు ఒకరోజు హైద్రాబాద్ లోని ఏ.ఎం.బి సినిమాస్ లో ప్రతిష్టించాలని ఫిక్స్ అయ్యి.. ఈమేరకు నిర్వహకులతో మాట్లాడి ఆ విగ్రహాన్ని హైద్రాబాద్ తెప్పించేందుకు కూడా రంగం సిద్ధం చేసింది నమ్రత. హైద్రాబాద్ లో డిస్ప్లేకి ఎప్పుడు పెడతారు అనేది తెలియాలి. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఆరోజు ఏ.ఎం.బి సినిమాస్ ముందు క్యూ కట్టేస్తారేమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus