Rajinikanth: రజనీకాంత్ అందుకే సూపర్ స్టార్ అయ్యారు.. ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. రజనీకాంత్ (Rajinikanth) సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ ఉంటాయి. అయితే రజనీకాంత్ మనస్సు బంగారం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ తాజాగా చేసిన సహాయంపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. రజనీకాంత్ నటించిన లాల్ సలాం (Lal Salaam) అనే మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.

ఈ సినిమాలో లివింగ్ స్టన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా షూట్ సమయంలో లివింగ్ స్టన్ భార్య గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారని తెలిసి రజనీకాంత్ 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారట. తాను సహాయం చేసిన విషయాన్ని సైతం రజనీకాంత్ ప్రచారం చేసుకోలేదు. కుడిచేతితో చేసే సహాయం ఎడమచేతికి కూడా తెలియకుండా చేయడం రజనీకాంత్ కు మాత్రమే సాధ్యమని ఈ జనరేషన్ లో రజనీకాంత్ లాంటి నటులు అరుదుగా ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్  కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటుండగా తర్వాత సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధిస్తాయని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. రజనీకాంత్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారనే సంగతి తెలిసిందే. రజనీకాంత్ పారితోషికం 100 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే రజనీకాంత్ మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

రజనీకాంత్ గతంలో కూడా ఎంతోమందికి ఆర్థిక సహాయం చేసి వార్తల్లో నిలిచారు. రజనీకాంత్ (Lokesh Kanakaraj) లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. రజనీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. రజనీ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus