Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » తొలి తెలుగు 70 ఎం.ఎం. చిత్రం ‘సింహాసనం’కు 30 ఏళ్ళు!

తొలి తెలుగు 70 ఎం.ఎం. చిత్రం ‘సింహాసనం’కు 30 ఏళ్ళు!

  • March 21, 2016 / 07:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తొలి తెలుగు 70 ఎం.ఎం. చిత్రం ‘సింహాసనం’కు 30 ఏళ్ళు!

తొలి తెలుగు జేమ్స్‌బాండ్‌ చిత్రం ‘గూఢచారి 116’ తొలి తెలుగు కౌబాయ్‌ చిత్రం ‘మోసగాళ్ళకు మోసగాడు’ తొలి తెలుగు సినిమా స్కోప్‌ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ని అందించిన సూపర్‌స్టార్‌ కృష్ణ తొలి తెలుగు 70 ఎం.ఎం 6 ట్రాక్‌ స్టీరియో ఫోనిక్‌ సౌండ్‌తో స్వీయ 1దర్శకత్వంలో నిర్మించిన ‘సింహాసనం’ మార్చి 21న 1986లో విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా మొదటి వారం 1 కోటి 51 లక్షల 65 వేల 291 రూపాయలు కలెక్ట్‌ చేసి ఆల్‌టైమ్‌ స్టేట్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ కృష్ణ ద్విపాత్రాభినయం చేసారు. అత్యంత భారీ సెట్స్‌ వేసి హైదరాబాద్‌ పద్మాలయా స్టూడియోలో, హోగినికల్‌లో, మైసూర్‌లో ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్‌ కృష్ణ నిర్మించారు. జానపద చిత్రాల్లోనే సరికొత్త ఒరవడిని సృష్టించిన ‘సింహాసనం’ ఓపెనింగ్స్‌ పరంగా ఆ రోజుల్లో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సృష్టించడమే కాకుండా శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకుంది. వైజాగ్‌ చిత్రాలయలో 100 రోజులు హౌస్‌ఫుల్స్‌తో ప్రదర్శింపబడింది. విజయవాడ రాజ్‌లో కంటిన్యూస్‌గా 53 రోజులు ఫుల్స్‌ అయింది. అలాగే డైరెక్ట్‌గా 16 కేంద్రాల్లో 50 రోజులు, 6 సెంటర్స్‌లో 100 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. హైదరాబాద్‌ దేవి థియేటర్‌లో రోజూ 4 ఆటలతో 105 రోజులు ఆడింది. చెన్నైలో ‘సింహాసనం’ శతదినోత్సవం విజిపి గార్డెన్స్‌లో జరిగినప్పుడు కృష్ణ అభిమానులు వేల సంఖ్యలో తరలిరావడం తమిళనాడు ప్రభుత్వాన్ని సైతం ఆశ్చర్య పరిచింది. దాదాపు 400 బస్సుల్లో ఘట్టమనేని అభిమానులు చెన్నై రావడం పెద్ద చర్చనీయాంశం అయింది. జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావుల నిర్వహణలో పద్మాలయా స్టూడియోస్‌ బేనర్‌పై కృష్ణ కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌ బాధ్యతలను నిర్వహిస్తూ నిర్మించిన ‘సింహాసనం’ ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం కావడం విశేషం. బప్పీలహరి సంగీత దర్శకత్వం వహించిన ‘సింహాసనం’ సాంగ్స్‌ అన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇప్పటికీ ‘ఆకాశంలో ఒకతార నా కోస మొచ్చింది ఈవేళ’, ‘వాహ్వా నీ యవ్వనం’, ‘గుమ్మా గుమ్మా ముద్దుగుమ్మ’ పాటలు వినిపిస్తూనే వుంటాయి.

రచయిత మహారథి ఈ చిత్రానికి మాటలు రాయడమే కాకుండా ఓ పాత్ర పోషించారు. తెలుగులో హిందీ నటుడు అంజాద్‌ ఖాన్‌ నటించిన తొలి చిత్రం ఇదే. కృష్ణ సరసన జయప్రద, రాధ, మందాకిని హీరోయిన్స్‌గా నటించగా వహీదా రెహమాన్‌, గుమ్మడి, ప్రభాకర్‌రెడ్డి, కాంతారావు, గిరిబాబు, సత్యనారాయణ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగులో ‘సింహాసనం’, హిందీలో ‘సింఘాసన్‌’ పేర్లతో రెండు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం 60 రోజుల్లోనే రూపొందించబడింది. వి.ఎస్‌.ఆర్‌.స్వామి ఛాయా గ్రహణం, భాస్కరరాజు కళా దర్శకత్వం, సి.మాధవరావు మేకప్‌, శీను నృత్య దర్శకత్వం, వీరు దేవగన్‌ ఫైట్స్‌ ‘సింహాసనం’ చిత్రాన్ని టెక్నికల్‌గా పెద్ద రేంజ్‌కి తీసుకెళ్ళాయి.

విక్రమసింహగా, ఆదిత్య వర్దనుడుగా సూపర్‌స్టార్‌ ద్విపాత్రాభినయం అభిమానుల్ని ఎంతగానో అలరించింది. ఈ చిత్రం విడుదల సమయంలో థియేటర్స్‌ దగ్గర ఓపెనింగ్‌కి వచ్చిన భారీ క్రౌడ్స్‌కి ట్రాఫిక్‌ జామ్‌ అయి ట్రాఫిక్‌ని వేరే రోడ్లవైపు డైవర్ట్‌ చెయ్యాల్సి రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగులో తొలి 70 ఎం.ఎం. చిత్రంగా అఖండ ప్రజాదరణ పొందిన ‘సింహాసనం’ విడుదలై 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో ఈ చిత్రం సృష్టికర్త సూపర్‌స్టార్‌ కృష్ణకు, ‘సింహాసనం’ యూనిట్‌కి అభినందనలు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amjaad Khan
  • #Jayapradha
  • #Krishna
  • #Super star Krishna

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

10 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

14 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

1 day ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

1 day ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

1 day ago

latest news

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

16 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version