సురేఖ వాణి(Surekha Vani) పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాల్లో అక్క, వదిన,అమ్మ, అత్త, పిన్ని పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే 2019 లో ఆమె భర్త మరణించడంతో ఆమె ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యింది. అప్పటి నుండి ఎక్కువ సినిమాల్లో ఈమె కనిపించడం లేదు. అయితే మరోపక్క తన కుమార్తె సుప్రీతతో కలిసి చేసే డాన్స్ వీడియోలు వైరల్ అయ్యేవి.
ఇదిలా ఉండగా.. ఇటీవల సుప్రీత ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందులో ఆమెకు మళ్ళీ పెళ్లి చేయాలనే ఉద్దేశం ఉన్నట్టు తెలిపి షాకిచ్చింది.
సుప్రీత మాట్లాడుతూ… “మా అమ్మ సురేఖ వాణికి మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన నాకు ఉంది. ఈ మధ్యనే మా అమ్మతో కూడా ఆ మాట చెప్పాను. కానీ ఆమె మా నాన్న దగ్గరే ఆగిపోవాలని అనుకుంటుంది. ఆ ప్లేస్‌లోకి వేరే వ్యక్తిని ఊహించుకోలేనని తెగేసి చెప్పేసింది. స్వయంగా ఆమె ఇచ్చిన ఆన్సర్ ఇది. అయితే జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవు.
ఊహించని సంఘటనలు మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు, వాటినే తలుచుకుని జీవితాంతం బాధపడకూడదు.ఆ ఒక్క చోటే మన జీవితం ఆగిపోకూడదు. అందుకే నేను పెళ్లి చేసుకునే ముందు ఆమెకు పెళ్లి చేయాలనే ఆలోచన నాకు ఉంది. మా అమ్మకి మామయ్య వరస అయ్యే ఓ వ్యక్తికి కూడా నేను నా అభిప్రాయం చెప్పడం జరిగింది. వాళ్లు కూడా సరే అని చెప్పారు. కానీ మంచి వ్యక్తి దొరకాలి.
అమ్మ ఓకే చెప్పాలి. మా అమ్మను బాగా చూసుకునే వ్యక్తి దొరకాలని దేవుడిని వేడుకుంటున్నాను. అలా దొరికితే ఆమె హ్యాపీగా ఉంటుంది. నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను. ‘మా అమ్మ ఏం కోరుకున్నా ఇవ్వాలి. కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకోవాలి. మా అమ్మని అనవసరంగా ప్రశ్నించి ఇబ్బంది పెట్టకూడదు. ఆమె స్పేస్ ఆమెకు ఇవ్వాలి’ అంటూ చెప్పుకొచ్చింది.