కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన కిరణ్.. మార్కెట్ పెరిగినప్పటి నుండి సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘ది చెన్నై స్టోరీ’ లో నటిస్తున్న కిరణ్.. తన తదుపరి ప్రాజెక్టుల కోసం కథలు వింటున్నారు. ఈ క్రమంలో ఓ మైథాలజి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే.. జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్,నిర్మాత ప్రేరణ అరోరా (Ess Kay Gee Entertainment) కలిసి ఓ భారీ పాన్-ఇండియా సినిమాని నిర్మించబోతున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ అద్భుతమైన విజువల్స్‌తో మిథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా తమ కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో కిరణ్ అబ్బవరం హీరోగా ఎంపికయ్యాడు. దీనికి కీర్తన్ సహ నిర్మాత.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. సెప్టెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అని సమాచారం.ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉంది. ఒకరిని బాలీవుడ్ నుండీ తీసుకునే అవకాశం ఉంది. ఇంకొక హీరోయిన్ కోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు. సినిమా టైటిల్, దర్శకుడు వంటి ఇతర వివరాలను త్వరలో వెల్లడించబోతున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ‘ది చెన్నై లవ్ స్టోరీ’ అనే ప్రేమకథా చిత్రంలో నటిస్తున్న కిరణ్ అబ్బవరం.. నెక్స్ట్ ఓ భారీ పాన్ ఇండియా సినిమా, అదీ మైథలాజి సినిమాలో నటించబోతుండటం విశేషంగానే చెప్పుకోవాలి.