ఈ మధ్య కాలంలో సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు. సురే ఖ వాణికి ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు తగ్గగా సుప్రీత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి పదుల సంఖ్యలో సినిమాల్లో నటించగా సుప్రీత మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన సుప్రీత ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న సుప్రీత తనను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి స్పందిస్తూ కాబోయే భర్త విషయంలో తనకు పెద్దగా కోరికలు లేవని చెప్పుకొచ్చారు. ఎక్కువగా ఆలోచించని, తన పిచ్చిని భరించే వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటున్నానని సుప్రీత తెలిపారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు స్పందిస్తూ మరో రెండు మూడు సంవత్సరాలు పడుతుందని ఆమె అన్నారు. అభిమానులలో ఎక్కువమంది హాయ్ అనే మెసేజ్ లు పెట్టగా హాయ్ అనే మెసేజ్ లు చూస్తుంటే తనకు బోర్ కొడుతోందని సుప్రీత తెలిపారు.
సురేఖ వాణితో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోల ద్వారా సుప్రీతకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. సురేఖ వాణి సెకండ్ మ్యారేజ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ కాగా ఆ వార్తలపై సుప్రీత గతంలో సీరియస్ అయ్యారు. కొన్ని సందర్భాల్లో సుప్రీతను నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీత కోరుకున్న లక్షణాలతో ఉన్న భర్త ఆమెకు దొరుకుతారో లేదో చూడాల్సి ఉంది.