ఇదంతా ఫేక్ న్యూస్: సురేఖావాణి సీరియస్ వార్నింగ్..!

  • February 21, 2021 / 07:35 PM IST

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి. రీసంట్ గా ఆమె రెండోపెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వెబ్ సైట్స్ లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల్నించీ ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. అయితే, ఇలాంటి న్యూస్ ఎలా వస్తుంది .. ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ సురేఖావాణి ఈవార్తలని ఖండించారు. దీని గురించి అఫీషియల్ గా అసలు ఎక్కడా ఎనౌన్స్ మెంట్ లేకపోయినా చాలా సైట్స్ లో, సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ పైన ఈ న్యూస్ బాగా వైరల్ అయ్యింది.

రీసంట్ గా 2019 లో తన భర్త సురేష్ తేజ చనిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత ఒకటిరెండు సినిమాలు చేసినా కూడా పెద్దగా హిట్స్ రాలేదు సురేఖా వాణికి. అంతేకాదు, ప్రస్తుతం కూతురు సుప్రీతతో కలిసి ఒంటరిగానే ఉంటోంది. ఇక కూతురు ఫోర్స్ మేరకు మరో పెళ్లి చేసుకుంటోందా అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఎందుకంటే, రీసంట్ గా సింగర్ సునీత రెండోపెళ్లి చేస్కుందని, ఆమె బాటలోనే సురేఖా వాణి కూడా చేసుకోబోతోందని వార్తలు వినిపించాయి. వీటిపై చాలా ఘాటుగా స్పందించింది సురేఖావాణి.

ఇదంతా కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని, ఏదైనా ఉంటే తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసి అందరికీ చెప్తానని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి న్యూస్ ని రాసేముందు కన్ఫార్మ్ చేస్కుని రాస్తే బెటర్ అని అంటోంది. ఇక ఇన్ స్ట్రాగ్రామ్ లో సురేఖా వాణికి విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు. అందుకే ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక యాక్టివిటీతో పార్టిసిపేట్ చేస్తుంది. మొత్తానికి అదీ మేటర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus