సురేఖా వాణి..ఈ పేరుకి ప్రత్యేక పరిచయమవసరం లేదు. టాలీవుడ్లో వచ్చిన పెద్ద పెద్ద సినిమాల్లో ఈమె తల్లి, పిన్ని,అక్క, అత్త,వదిన వంటి పాత్రలు పోషించి కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయింది. ఎప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా కనిపించే సురేఖ వాణి… 2019 వ సంవత్సరం నుండీ బాగా డల్ అయ్యింది.తన భర్త అనారోగ్యంతో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో.. ఆమె కొన్నాళ్ల పాటు తీవ్ర మనస్తాపానికి గురయ్యి.. అస్సలు బయటకి రాలేదు. అయితే కూతురు సుప్రీత కోసం ఆమె వాటిని దిగమింగుకుని నార్మల్ అయ్యింది.
ప్రస్తుతం తన కూతురి కెరీర్ ను సెట్ చెయ్యాలని ఈమె చాలా ప్రయత్నాలు చేస్తుంది.ఇదిలా ఉండగా.. ఈమెను హీరోయిన్ ను చేసేందుకు సురేఖ చాలా ప్రయత్నాలు చేస్తుందట. గతంలో సుప్రీతను నటిని చెయ్యాలనే ఉద్దేశం తనకి లేదని తెలిపిన సురేఖ వాణి..ఇప్పుడు హీరోయిన్ ను చెయ్యడానికి ప్రయత్నిస్తుంది అనే వార్తలు రావడం ఓ రకంగా ఆశ్చర్యకరమే. ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలీదు కానీ.. ఓ బడా బ్యానర్లో, బడా హీరో నటించబోయే సినిమాతో సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందట.
అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతుందని వినికిడి. గత రెండు,మూడు రోజులుగా సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదని సురేఖ వాణి క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో సుప్రీత హీరోయిన్ ఎంట్రీ వార్త పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.