Mega Family: కొణిదెల కుటుంబం గురించి ఈ విషయం మీకు తెలుసా?

మీరు మెగా ఫ్యామిలీ ఫ్యానా? మీకు చిరంజీవి కుటుంబం గురించి అంతా తెలుసా? ఏంటీ ఇలా అడుగుతున్నారు అనుకుంటున్నారా? దానికీ ఓ కారణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేం చెప్పబోయే విషయం చాలా తక్కువమందికే తెలుసు కాబట్టి. చిరంజీవి తొలి సినిమా నుండి, కుటుంబ సభ్యుల పేర్ల వరకు… అలాగే పవన్‌ కల్యాణ్‌ ఫస్ట్‌ మూవీ నుండి, రీసెంట్‌ మూవీ కలెక్షన్ల వరకు అన్నీ తెలుసు. అలాగే రామ్‌చరణ్‌, సాయితేజ్‌, వైష్ణవే తేజ్‌…

Click Here To Watch Now

ఇలా అందరి గురించి తెలుసు అంటరా? అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది చిరంజీవి తరం విషయమే. చిరంజీవి కుటుంబం గురించి మనకు తెలియని రహస్యాలు కొన్ని ఉన్నాయి. ఏ కుటుంబానికైనా ఉంటాయి అనుకోండి ఆ మధ్య పవన్‌ చెప్పిన విషయం తెలిస్తే మాత్రం… కచ్చితంగా షాక్ అవుతారు. వారి కుటుంబం గురించి ఇప్పటివరకు పెద్దగా తెలియని ఓ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ మేటర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అది చూసిన అభిమానులు అవునా, నిజమా అనుకుంటున్నారు. అదేంటి మాకు ఇన్నేళ్లగా ఈ విషయం తెలియలేదే అనుకుంటున్నారట. అంత పెద్ద సీక్రెట్‌ పవన్‌ ఏం చెప్పాడు అని అనుకుఒంటున్నారు. ఆయన చెప్పింది వాళ్ల తోబుట్టువుల గురించి అంట. వెంకట్రావు, అంజనా దేవీ సంతానం అంటే ముగ్గురు మగ బిడ్డలు, ఇద్దరు ఆడ బి డ్డలు మొత్తం ఐదుగురే అని అందరూ అనుకుంటారు. కానీ వాళ్లు ఎనిమిది మందదట. చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌, విజయ దుర్గ, మాధవీరావుతోపాటు మరో ముగ్గురు… మొత్తంగా వాళ్లు ఎనిమిది మందట.

అయితే అందులో ముగ్గురు చిన్నతనంలో చనిపోయారట. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యం తదితర కారణాల వల్ల ఆ ముగ్గురు చిన్నతనంలోనే కన్నుమూశారని పవన్‌ కల్యాణ్‌ ఓ సందర్భంలో చెప్పారట. అయితే తాజాగా ఆ విషయం ఎవరో ఎక్కడో ట్వీట్ చేస్తే… మళ్లీ చర్చకు వచ్చింది. మెగా ఫ్యామిలీ అంటే ఐదుగురు కాదు, ఎనిమిది మంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అదీ ఎవరికీ తెలియని విషయం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus