ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు అందరూ పెళ్లి చేసుకొని కొత్త జీవితంలో అడుగుపెట్టగా త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మరొక హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తుంది. త్వరలోనే దగ్గుబాటి కాంపౌండ్లో పెళ్లి భాజలు మోగనున్నాయని ఫిలిం ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతుంది.
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడిగా రానా అందరికీ సుపరిచితమే ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.సురేష్ బాబు రెండవ కుమారుడు అభిరామ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన కూడా అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా తీవ్ర నిరాశపరిచిందని చెప్పాలి.ఇక ఈయన తదుపరి సినిమా కోసం పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకోవడంలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
అయితే అభిరామ్ (Abhiram) తదుపరి సినిమా ప్రకటన కంటే ముందుగానే ఈయన పెళ్లి వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.త్వరలోనే అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒక వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయాన్నికి వస్తే… అభిరామ్ తన సమీప బంధువు అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారు.
రామానాయుడు తమ్ముడి మనవరాలిని అభిరామ్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారని కుటుంబ పెద్దల ఇష్ట ప్రకారమే ఈ వివాహం జరగబోతుందని తెలుస్తోంది.ఇప్పటికే ఈ వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేయనున్నారు. ఇండస్ట్రీలోకి రాకముందే అభిరామ్ ఎన్నో వివాదాలలో చిక్కుకొని పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!