మీడియం రేంజ్ సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సురేష్ ప్రొడక్షన్స్!

  • May 26, 2022 / 05:56 PM IST

సురేష్ ప్రొడక్షన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి పెద్ద బ్యానర్ లో ఇది ఒకటి. డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు పొందారు. ఇక రామానాయుడు వారసుడిగా సురేష్ బాబు బ్యానర్ బాధ్యతలను చేతపట్టి ఆయన ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు.ఇకపోతే గత కొంతకాలం నుంచి సురేష్ ప్రొడక్షన్స్ లో ఏవిధమైనటువంటి భారీ బడ్జెట్ చిత్రాలు రాకపోవడం గమనార్హం.

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో మీడియం రేంజ్ సినిమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలను ఎంపిక చేసుకొని తక్కువ బడ్జెట్ లో,ఇతరులతో కలిసి చిత్రాలను నిర్మిస్తూ మంచి విజయాలను అందుకుని భారీ లాభాలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో మీడియం రేంజ్ సినిమాలు రావడంతో ఇకపై ఈ బ్యానర్ లో ఇలాంటి సినిమాలనే నిర్మిస్తారని తెలుస్తోంది.

ఇండస్ట్రీలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ కి ఉన్న వ్యాల్యూ తో ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి పలు చిత్రాలను నిర్మిస్తూ భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.ఈ విధంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను తీసుకుంటూ దూసుకుపోతున్న సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ విధమైనటువంటి సినిమాలను చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విధంగా సురేష్ బ్యానర్స్ లో ఇలా మీడియం రేంజ్ సినిమాలు తెరకెక్కడంతో ఈయన బాటలోనే మరికొన్ని ప్రొడక్షన్స్ కూడా చిన్న సినిమాల వైపు మొగ్గు చూపడం గమనార్హం.

ఈ క్రమంలోనే సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తాజాగా రాజమండ్రి రోజ్ మిల్క్ అనే సినిమాను ప్రదీప్ ఉప్పలపాటితో కలిసి సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.ఈ విధంగా సురేష్ బాబు చిన్న సినిమాలను నిర్మిస్తూ, అధిక లాభాలను తీసుకోవడంతో ఇకపై సురేష్ ప్రొడక్షన్స్ లోఇలాంటి సినిమాలు వస్తాయని, భారీ బడ్జెట్ సినిమాలకు సురేష్ ప్రొడక్షన్స్ దూరమవుతున్నారని తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus