గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. కానీ?

  • November 27, 2021 / 02:19 PM IST

సినిమా రంగంలో అందంగా కనిపించే హీరోయిన్లకు మాత్రమే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. బరువు పెరిగినా, అందంగా కనిపించకపోయినా సినిమా రంగంలో గుర్తింపు తెచ్చుకోవడం తేలిక కాదు. కొంతమంది హీరోయిన్లు మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో సర్జరీలు చేయించుకున్నారు. సర్జరీల ద్వారా ఆయా హీరోయిన్లు తమ అందానికి మెరుగులు దిద్దుకున్నారు. అయితే కొన్నిసార్లు సర్జరీలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సర్జరీలు వికటించడం ద్వారా కొంతమంది హీరోయిన్లు విమర్శలను ఎదుర్కోవడంతో పాటు సినిమా ఆఫర్లను కోల్పోయారు.

అయితే ప్రస్తుతం దిశా పటానీ నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. సల్మాన్ హీరోగా తెరకెక్కిన అంతిమ్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కార్యక్రమానికి దిశా పటానీ హాజరు కాగా దిశ లుక్ లో తేడాను గమనించిన నెటిజన్లు ఆమెను పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ముక్కు, పెదాలకు దిశ సర్జరీ చేయించుకున్నారని కొందరు కామెంట్లు చేస్తుంటే అందంగా ఉండే ముఖాన్ని సర్జరీతో దిశ అందవిహీనంగా మార్చుకున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ గురించి దిశ స్పందించి వివరణ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

లోఫర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీకి ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం విజయాలను అందుకుని దిశా పటానీ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. గతంలో హీరోయిన్ అయేషా టకియాకు సర్జరీ వికటించిన సంగతి తెలిసిందే. దిశ సర్జరీ రూమర్ల గురించి త్వరగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus