Kanguva: ‘కంగువ’ క్లైమాక్స్‌ను అలా ప్లాన్‌ చేసిన దర్శకుడు… ఆ రేంజి హైప్‌ కోసమేనా?

  • July 30, 2024 / 07:46 PM IST

స్టార్‌ హీరో సినిమాలో ఇంకో స్టార్‌ హీరో నటిస్తే వచ్చే కిక్కే వేరు. దీని గురించి మీకు పర్‌ఫెక్ట్‌ ఉదాహరణ చెప్పాలి అంటే కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమా గురించే చెప్పాలి. అందులో రోలెక్స్‌గా సూర్య (Suriya)  వస్తాడు అని సినిమా ఫస్ట్‌ షో చూసేవరకు ఎవరికీ తెలియదు. అంతలా గోప్యంగా వచ్చారు. అంతలా ఇప్పుడు దాయలేకపోయారు కానీ.. ‘కంగువ’ (Kanguva) సినిమాలో అలాంటి రోల్‌ ఒకటి ఉంది అని తాజాగా వార్తలు వస్తున్నాయి.

కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం చూస్తే.. సూర్య కొత్త సినిమాలో కార్తి కీలక పాత్రలో కనిపిస్తాడట. ‘కంగువ’ సినిమా క్లైమాక్స్‌లో కార్తి ఎంట్రన్స్‌ ఉంటుంది అని చెబుతున్నారు. సినిమా రెండో పార్టుకు వెళ్లడం కార్తి పాత్రతోనే నడిపిస్తారు అని చెబుతున్నారు. దీని మీద అధికారిక ప్రకటన రాలేదు, రాకపోవచ్చు అయితే సోర్సెస్‌ మాత్రం బలంగా అదే మాట చెబుతున్నాయి. విడుదలకు ఇంకా రెండు నెలలు ఉన్నప్పటికీ ‘కంగువ’ సినిమా మీద అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి.

రెండేళ్ల పైగా గ్యాప్ తర్వాత సూర్య సినిమా వస్తుండటం ఒకటైతే, సినిమా ప్రచార చిత్రాలు తీసుకొచ్చిన హైప్‌ మరో కారణం. అక్టోబర్ 10 దసరా కానుకగా సినిమా రిలీజవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సూర్య రెండు కాలాలకు సంబంధించిన వీరుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దర్శకుడు సిరుతై శివ (Siva) ప్రత్యేకంగా సూర్య, కార్తి పాత్రలను డిజైన్ చేసినట్టు సమాచారం వస్తోంది.

ఐమాక్స్, త్రీడి, ఫోర్డిఎక్స్ వెర్షన్లలో రూపొందుతున్న ‘కంగువ’ సినిమా రెండో భాగం 2026 లేదా 2027 వచ్చేలా చూసుకుంటున్నారట. తొలి సినిమా ఫలితం బట్టి రెండో పార్టు విషయంలో శివ జాగ్రత్తలు తీసుకుంటారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ‘బాహుబలి’ (Baahubali) , ‘కేజీయఫ్‌’ (KGF) , ‘పుష్ప’ (Pushpa) , ‘సలార్‌’ (Salaar) విషయంలో ఇదే చేశారు, చేస్తున్నారు కూడా. అన్నట్లు పైన చెప్పిన సినిమాల తరహాలోనే ‘కంగువ’ ప్రచారం చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది అని చెబుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus