Manchu Manoj ,Sai Dharam Tej: సాయితేజ్‌ సినిమాలో మనోజ్‌… ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందంటే?

‘విరూపాక్ష’ (Virupaksha) సినిమాతో హిట్‌ కొట్టిన తర్వాత సాయితేజ్‌ (Sai Dharam Tej)  కొత్త సినిమా విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు అనుకుంటుండగా.. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో ఓ పీరియాడిక్‌ యాక్షన్‌ సినిమా అనౌన్స్‌ చేసి వావ్‌ అనిపించాడు. అది కూడా ఏదో చిన్న సినిమా కాదని, దర్శకుడు రోహిత్‌ కె.పి భారీ ప్రాజెక్టే చేస్తున్నాడు అని తెలిసింది. ఇప్పుడు కాస్టింగ్‌ విషయంలోనూ టీమ్‌ భారీగానే ఆలోచిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న సాయితేజ్‌ సినిమాలో కొత్తగా ఓ బెస్ట్‌ యాక్టర్‌ యాడ్‌ అవ్వబోతున్నాఉ. మంచు మనోజ్‌  (Manchu Manoj) ఇప్పుడు హీరో నుండి యాక్టర్‌ మోడ్‌లోకి వచ్చాడు.

మొన్నీమధ్యే తేజ సజ్జా సినిమాలో ముఖ్య పాత్రకు ఓకే చెప్పిన ఆయన.. ఇప్పుడు సాయితేజ్‌ సినిమాలో యాక్ట్‌ చేయడానికి అంగీకరించాడు అని అంటున్నారు. ఆగస్టులో మొదలుకానున్న కొత్త షెడ్యూల్‌లో మనోజ్‌ సెట్లో అడుగు పెడతాడు అని సమాచారం. ఇక ఈ సినిమా కథ గురించి చూస్తే స్వాతంత్య్రం రాక ముందు జరిగిన కథతో సినిమాలో రూపొందుతోంది అని చెబుతున్నారు.

అయితే భారతీయులు – ఆంగ్లేయుల కథనా.. లేక అప్పటి బ్యాక్‌డ్రాప్‌లో మన కథనా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కోసం సాయితేజ్‌ సిక్స్‌ప్యాక్‌ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. నిజానికి ‘విరూపాక్ష’ సినిమా తర్వాత సాయితేజ్‌ ‘గాంజా శంకర్‌’ అనే సినిమా చేయాలి. అన్నీ ఓకే అనుకుని.. స్టార్ట్‌ చేద్దాం అనుకున్నారు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా అసలు ముందుకు వెళ్లలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను స్టార్ట్‌ చేశారు.

ఇక మనోజ్‌ సంగతి చూస్తే.. ‘వాట్‌ ది ఫిష్‌’ అనే సినిమా హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే ఇప్పుడు ఆ సినిమా ఎంతవరకు వచ్చింది అనేది తెలియడం లేదు. ఇక తేజ సజ్జా (Teja Sajja)   హీరోగా రూపొందుతున్న ‘మిరాయ్‌’ (Mirai) లో  కూడా మనోజ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus