Mr.Bachchan Teaser: మిస్టర్ బచ్చన్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో  ‘షాక్’ (Shock) ‘మిరపకాయ్’ (Mirapakay)  వంటి చిత్రాల తర్వాత రూపొందిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 15 న ఈ సినిమా విడుదల కాబోతోంది.ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్ , సితార్, రెప్పల్ డప్పుల్ వంటి పాటలు ప్రేక్షకుల నుండీ సూపర్ రెస్పాన్స్ ని రాబట్టుకున్నాయి.

మరో రకంగా సినిమాకి అవి మంచి హైప్ తీసుకొచ్చాయి అని చెప్పాలి.ఇక తాజాగా టీజర్ ని కూడా విడుదల చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. ఇది 1: 35 నిమిషాల నిడివి కలిగి ఉంది. టీజర్ ఆరంభంలో రొమాంటిక్ అండ్ కామిడీ ట్రాక్ లకి సంబంధించిన క్లిప్స్ ఉన్నాయి. ఆ తర్వాత మెయిన్ ట్రాక్ ఏంటి అనేది చూపించారు.’ ఈ దేశాన్ని పీడిస్తున్నది దారిద్ర్యం కాదు నల్లదనం ‘ అంటూ వచ్చే డైలాగ్ కథపై అవగాహన కల్పించేలా ఉంది.

ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్ , విలన్ జగపతిబాబుని (Jagapathi Babu) చూపించారు. రవితేజ ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ కి చెందిన వ్యక్తిగా చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. ‘ సక్సెస్ , ఫెయిల్యూర్ అనేవి ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి.. కానీ ఆటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది పోయేదాకా మనతోనే ఉంటుంది’ అనే డైలాగ్ టీజర్ కి హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. టీజర్ ని మీరు కూడా ఒకసారి చూడండి:

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus