Suriya, Director Bala: ‘శివపుత్రుడు’ కాంబో రిపీట్!

  • October 28, 2021 / 07:25 PM IST

కోలీవుడ్ లో ‘పితామగన్’ పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ‘శివపుత్రుడు’ అనే పేరుతో విడుదల చేశారు. రెండు దశబ్దాల క్రితం వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో విక్రమ్, సూర్యలకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. సూర్య క్యారెక్టర్ ఎమోషనల్ గా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఆ తరువాత నుంచి సూర్య నటించే సినిమాలు ఒక్కొక్కటిగా తెలుగులో అనువాదమవుతున్నాయి. అలా వచ్చిన సినిమాల్లో ‘గజినీ’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సూర్యకు తెలుగులో మార్కెట్ ఏర్పడింది.

‘శివ పుత్రుడు’ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు బాలతో సూర్య మరో మూడు సినిమాల్లో నటించాడు. అవి కూడా ఆయన కెరీర్ కి బాగా కలిసొచ్చాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలుస్తోంది. బాల దర్శకత్వంలో తన తదుపరి సినిమా ఉంటుందని సూర్య ప్రకటించాడు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఈసారి వీరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

ప్రస్తుతం సూర్య ‘జైభీమ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus