గోల గోల చేస్తున్న.. సూర్య ఫ్యాన్స్..!

  • November 16, 2020 / 02:51 PM IST

స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. గురు ఫేమ్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కిన ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుద‌ల అయ్యి బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. సూర్య స‌హ‌జ‌మైన న‌ట‌న‌, సుధా కొంగ‌ర టేకింగ్ పై స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుడు నుండి సినీ ప్రముఖుల నుండి ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. ఇక చాలా గ్యాప్ త‌ర్వాత సూర్య భారీ హిట్ కొట్ట‌డంతో, ఆయ‌న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అయితే ఒక‌వైపు త‌మ అభిమాన హీరో సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింద‌నే ఆనందం ఉన్నా మ‌రోవైపు సూర్య ఫ్యాన్స్ కాస్త నిరాశ‌లో ఉన్నార‌ని తాజాగా సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌లు చూస్తే అర్ధ‌మ‌వుతోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. సింగం త‌ర్వాత ఆ రేంజ్‌లో సూర్య‌ హిట్ కొట్ట‌లేక‌పోయాడు. ఈ హీరో నుండి వ‌చ్చిన గ్యాంగ్ , ఎన్జీకె, బందోబ‌స్త్ చిత్రాలు అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా విఫ‌లం అయ్యాయి. దీంతో ఓ సాలిడ్ హిట్ కొట్టాల‌ని ఒక‌వైపు సూర్య,

మ‌రోవైపు ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న క్ర‌మంలో సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో మూవీ ఓకే అవ‌డం, అందునా ఆ మూవీ బ‌యోపిక్ అవ‌డంతో, ఆకాశం నీ హ‌ద్దురా మూవీ పై ప్రేక్ష‌కుల్లో పిచ్చ క్యూరియాసిటీ ఉంది. అయితే కోవిడ్ కార‌ణంగా థియేట‌ర్స్ ఓపెన్ కాక‌పోవ‌డంతో, వేచి చూడ‌కుండా ఓటీటీ ద్వారా రిలీజ్ చేశారు. సినిమా ఏమో సూర్య ఫ్యాన్స్ ఊహించిన దాని కంటే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.

ఇప్పుడు తమ హీరో సినిమా ఓ రేంజ్‌లో వేరే లెవ‌ల్‌లో ఉండ‌డంతో, ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేయ‌లేక‌పోతున్నారు. అదే థియేట‌ర్స్‌లో బొమ్మ ప‌డి ఉంటే, ముఖ్యంగా బిసి సెంట‌ర్స్‌లో భారీ క‌లెక్ష‌న్స్‌తో పాటు ర‌చ్చ వేరేగా ఉండేద‌ని, థియేట‌ర్స్ ముందు బ్యాన‌ర్స్, క‌టౌట్స్‌కి పాలాభిషేకాలు ఇక క‌థ మ‌రోలా ఉండేద‌ని సూర్య ఫ్యాన్స్ ఇప్పుడు గోల గోల చేస్తున్నారు. ఏది ఏమైనా సూర్య మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయినా, ఓటీటీ రిలీజ్ కావ‌డంతో, సెల‌బ్రేట్ చేసుకోలేక‌పోతున్నామ‌ని ఆయ‌న ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ‌

Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus