Suriya Remunaretion: సూర్య స్పెషల్ రోల్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • June 6, 2022 / 12:23 PM IST

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం విక్రమ్.ఈ సినిమా జూన్ 3వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. గత నాలుగు సంవత్సరాల నుంచి వెండితెరపై కమల్ హాసన్ సందడి చేయలేదు అనే లోటు ఈ సినిమాతో తీరిపోయిందని చెప్పాలి. ఇలా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను కమల్ హాసన్ ఎంతో సందడి చేశారు. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ లో తెరకెక్కించారు.

ఇక ఈ సినిమాలో ప్రముఖ నటులు నటించడంతో ఈ సినిమా మరింత విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథి పాత్ర ద్వారా సందడి చేశారు. పవర్ ఫుల్ పాత్రలో సూర్య ఎంట్రీ అదిరిపోయిందని చెప్పాలి. ఇలా ఈ సినిమాలో అందరూ కూడా స్టార్ సెలబ్రిటీలు కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అనుకున్న విధంగానే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుంది.

ఇకపోతే ఈ సినిమాలో సూర్య అతిథి పాత్రలో నటించినందుకు ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం సూర్య ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా కమల్ హాసన్ గారు ఫోన్ చేయగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సూర్య ఈ సినిమాలో నటించినట్లు తెలుస్తుంది. కమల్ హాసన్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం సూర్య కల.

ఈ విధంగా విక్రమ్ సినిమా ద్వారా తన కల నెరవేరిందని సూర్య కమల్ హాసన్ కు ప్రత్యేకంగా థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.ఇలా ఈ సినిమా ద్వారా తన కలను నెరవేర్చుకున్న సూర్య ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా కమల్ హాసన్ గారి కోసం ఫ్రీగా నటించారట. ఇలా సూర్య ప్రత్యేక పాత్రలో ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించడంతో అభిమానులు అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus