సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి (S. S. Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో సూర్య (Suriya) మహేష్ బాబు గురించి, మహేష్ బాబుతో స్నేహం గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. చెన్నైలోని సెయింట్ బీడ్ స్కూల్ లో పదో తరగతి వరకు చదువుకున్నానని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు, యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) నా క్లాస్ మేట్స్ అని సూర్య కామెంట్స్ చేశారు.
మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అని కలిసి భోజనం చేసేవాళ్లమని ఒకరి ఇంట్లో చేసిన వంటకాలను మరొకరి కోసం తీసుకెళ్లే స్థాయి ఫ్రెండ్ షిప్ మా మధ్య ఉండేదని సూర్య వెల్లడించారు. మా మధ్య ఏదైనా చర్చ జరిగితే ఫ్యామిలీ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వాళ్లమని సూర్య అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. సినిమాల గురించి ఆ సమయంలో మా మధ్య చర్చ జరిగేది కాదని సూర్య చెప్పుకొచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం రాలేదని సూర్య చెప్పుకొచ్చారు. యువన్ శంకర్ రాజా దాదాపుగా నేను నటించిన పది సినిమాలకు వర్క్ చేశాడని సూర్య వెల్లడించారు. సూర్య, మహేష్ బాబు మధ్య బాండింగ్ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహేష్ బాబు సైతం భవిష్యత్తులో సూర్యతో స్నేహం గురించి స్పందించే ఛాన్స్ అయితే ఉంది.
రాబోయే రోజుల్లో సూర్య, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు, సూర్య వయస్సు కూడా దాదాపుగా సేమ్ అనే సంగతి తెలిసిందే. ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య మహేష్ బాబుతో స్నేహానికి సంబంధించిన రహస్యాలను రివీల్ చేయడం జరిగింది. ప్రస్తుతం సూర్య కంగువ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాలో కార్తీ కూడా నటిస్తున్నారు.