Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

ఒకరు భారీ చిత్రాల సీనియర్‌ దర్శకుడు.. మరొకరు కమర్షియల్‌ టచ్‌ ఉన్న సోషల్‌ ఎలిమెంట్స్‌ బలంగా చెప్పగల దర్శకుడు. రెండో వ్యక్తి దర్శకుడితో పాటు మంచి రచయిత కూడా. అయితే ఇద్దరికీ సరైన విజయాలు వచ్చి చాలా ఏళ్లు అయింది. రీసెంట్‌గా చేసిన సినిమా దారుణమైన పరాజయాన్ని కూడా అందుకున్నారు. మరి ఈ కారణమో, లేక ఇంకేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ ఇద్దరూ కలవబోతున్నారని అని చెబుతూ.. ఇటీవల ఆ హీరో అజిత్‌ అని చెప్పాం మీరు చదివే ఉంటారు. కానీ ఇప్పుడు అప్‌డేట్ మారింది.

Shankar – Murugadas

కోడంబాక్కం లేటెస్ట్ పుకార్ల ప్రకారం చూస్తే.. ఇద్దరు స్టార్‌ డైరక్టర్లు కలవబోతోంది అజిత్‌ కోసం కాదట.. సూర్య మైల్‌ స్టోన్‌ మూవీ కోసమట. సూర్య చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తన 47వ సినిమాగా జీతూ మాధవన్‌ డైరక్షన్‌లో రూపొందబోయే సినిమా ఉంటుంది. ఆ తర్వాత 48వ సినిమాగా టీజీ జ్ఞానవేల్‌ ప్రాజెక్ట్, 49వ సినిమా హెచ్‌.వినోద్‌ సినిమా ఉంటాయి అని అంటున్నారు. దీంతో మైల్‌స్టోన్‌ సినిమా 50వ పిక్చర్‌ ఏంటి అనే చర్చ గతకొన్ని రోజులుగా జరుగుతోంది. దానికి సమాధానమే శంకర్‌ – మురుగదాస్ సినిమా అని చెబుతున్నారు.

నిజానికి ఈ ప్రాజెక్ట్‌ తొలుత సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ – నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ సినిమా అవుతుంది అనుకున్నారు. కానీ ఆ సినిమా కాకుండా కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌తో మరో సినిమా ప్లాన్‌ చేశారట. అదే ‘శంకర్‌ – మరుగదాస్‌’ సినిమా అని చెబుతున్నారు. మురుగుదాస్‌ దగ్గర ఓ మాస్‌ మసాలా, యాక్షన్‌ హీరో సినిమా కథ ఉంది. ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న మాస్‌ స్టార్‌ హీరో ఎవరైనా బాగుంటుంది అనుకుంటున్నారు. ఆ కథను శంకర్‌ డైరెక్ట్‌ చేస్తారని తెలుస్తోంది. మురుగుదాస్‌ ఎలిమెంట్స్‌, శంకర్‌ భారీ లుక్‌తో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సూర్యతో శంకర్‌.. మధ్యలో మురుగదాస్‌.. సెమ్మా కాంబో కదా.

 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus