Kanguva 2: కంగువ2 సినిమాపై మేకర్స్ సంచలన వ్యాఖ్యలు.. అసలేమైందంటే?

స్టార్ హీరో సూర్య (Suriya)  తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించి ఆ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. సూర్య మరికొన్ని రోజుల్లో కంగువ (Kanguva) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అక్టోబర్ 10వ తేదీన కంగువ పార్ట్1 థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. కంగువ సినిమాకు సీక్వెల్ గా కంగువ2 సినిమా తెరకెక్కుతోంది. అయితే కంగువ2 సినిమా గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) ఒకింత సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

కంగువ కంటెంట్ పెద్దగా తెలియదు కాబట్టి కంగువ1 వచ్చే తేదీకి మరికొన్ని సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ ఉందని కానీ కంగువ2 సినిమాతో మాత్రం ఎవరూ పోటీకి రారని కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని నేను కాన్ఫిడెన్స్ తో చెబుతున్నానని ఆయన కామెంట్లు చేశారు. కంగువ2 కంటెంట్ అంత బలమైనదని కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చారు. కంగువ సినిమాతో 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.

కంగువ సీక్వెల్ కు స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైందని ఆయన తెలిపారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నామని నిర్మాత వెల్లడించారు. కంగువ సినిమాలో ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కంగువ2 సినిమా నిజంగానే ఆ రేంజ్ లో ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. కంగువ సినిమాపై అంచనాలు పెంచే విషయంలో మేకర్స్ సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

కంగువ2 ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. కంగువ2 సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. సూర్య భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

c

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus