Pallavi Prashanth: కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలబడ్డ పల్లవి ప్రశాంత్.. కానీ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు (Pallavi Prashanth) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. బిగ్ బాస్ షో సీజన్7 తర్వాత పలు వివాదాల ద్వారా పల్లవి ప్రశాంత్ పేరు మారుమ్రోగింది. పల్లవి ప్రశాంత్ తన ఫ్రైజ్ మనీ మొత్తాన్ని రైతులకు సహాయం చేస్తానని చెప్పి మాట తప్పారని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ తాజాగా మరో కుటుంబానికి అండగా నిలబడ్డారు.

మెదక్ జిల్లాలోని శంకరంపేటలో పరమేశ్వర్ అనే రైతు ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరమేశ్వర్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని భార్య శంకరమ్మ, ముగ్గురు కూతుళ్లు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో పల్లవి ప్రశాంత్ వెంటనే స్పందించి తన వంతు సహాయం చేశారు. ఆ కుటుంబానికి పల్లవి ప్రశాంత్ 20,000 రూపాయల సహాయం అందజేయడం గమనార్హం.

అయితే పల్లవి ప్రశాంత్ మరింత ఎక్కువ మొత్తం సహాయం చేసి ఉంటే బాగుండేదని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కెరీర్ ప్లాన్స్ మాత్రం అర్థం కావడం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో పల్లవి ప్రశాంత్ ఏ రంగాన్ని ఎంచుకుంటారో చూడాల్సి ఉంది. పల్లవి ప్రశాంత్ వివాదాలకు తావివ్వకుండా కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పల్లవి ప్రశాంత్ పలు టీవీ షోలలో కనిపిస్తున్నా ఆ షోలు ప్రశాంత్ కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో ఫ్రైజ్ మనీని మరింత ఎక్కువ మంది రైతులకు వీలైనంత వేగంగా సహాయంగా అందిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షో తెలుగులో విజేతలుగా నిలుస్తున్న కంటెస్టెంట్లు కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus