Double iSmart Trailer: ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..ల కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అప్పటివరకు ప్లాపులతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ కి.. పెద్ద రిలీఫ్ ఇచ్చింది ఆ మూవీ. రామ్ మార్కెట్ ను కూడా డబుల్ చేసింది. ఇక ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. పూరీ, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, 3 పాటలు ఆల్రెడీ రిలీజ్ అయ్యి.. ఆగస్టు 15 న సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి.

ఇక ట్రైలర్ వేడుకను ఈరోజు వైజాగ్ లో ఏర్పాటు చేశారు మేకర్స్. కొద్దిసేపటి క్రితం ట్రైలర్ కూడా యూట్యూబ్లో రిలీజ్ అయ్యింది. 2 నిమిషాల 42 సెకన్లు నిడివి కలిగిన ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్.. కంప్లీట్ గా మాస్ ఆడియన్స్ నే ఫోకస్ చేసి కట్ చేసినట్టు ఉంది. విలన్ తన మెమరీని శంకర్(రామ్) కి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకోవడం..

ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటి అనేది ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇందులో కూడా బలమైన ఎమోషనల్ కనెక్ట్ ఉందనిపిస్తుంది. ఏదేమైనా ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ తో పోలిస్తే ట్రైలర్ చాలా బెటర్ అనిపించింది. ముఖ్యంగా మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి హైలెట్ అని చెప్పాలి. చూస్తుంటే.. పూరీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు. ట్రైలర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి:

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus