Nagababu: ఈ చిన్న సాయం పెద్ద గొప్పది కాకపోవచ్చు.. నాగబాబు కామెంట్స్ వైరల్!

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) జనసేన ఈ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో ఎంతో సంతోషంగా ఉన్నారని సమాచారం అందుతోంది. నాగబాబు ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. 2024 ఎన్నికల్లో నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వినిపించినా వేర్వేరు కారణాల వల్ల నాగబాబు ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే గతంలో ఒక సందర్భంలో ఇచ్చిన మాటను నాగబాబు నిలబెట్టుకున్నారు. ఆపరేషన్ వాలంటైన్ (Operation Valentine) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకి నా వంతు సాయం చేస్తానని మాట ఇవ్వగా ఆ మాటను నిలబెట్టుకున్నారు.

అప్పుడు చెప్పిన మాట ప్రకారం 6 లక్షల రూపాయల సహాయం చేశానని సోషల్ మీడియా వేదికగా నాగబాబు చెప్పుకొచ్చారు. తాను చేసిన సహాయం పెద్ద సహాయం గొప్ప సహాయం కాకపోవచ్చని అయితే ఇచ్చిన మాటను మాత్రం మరిచిపోలేదని ఆయన అన్నారు. దేశ సేవలో ప్రాణాలర్పించిన వారికి తోడ్పాటు అందించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని నాగబాబు అన్నారు. నాగబాబు గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సాయం తక్కువ మొత్తమే కావచ్చు కానీ సాయం చేసే గుణం ఎంతమందికి ఉంటుందని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబు ట్విట్టర్ పోస్ట్ కు 4700కు పైగా లైక్స్ వచ్చాయి. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాపైనా వరుణ్ తేజ్ కష్టాన్ని, కథల ఎంపికను మాత్రం ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.

మనస్సుకు నచ్చిన కథలను ఎంచుకుంటున్న వరుణ్ తేజ్ కు భారీ విజయాలు దక్కాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. వరుణ్ తేజ్ పారితోషికం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.


Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus