బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో కూడా చెప్పలేం. ఈ రోజు కూడా అదే జరిగేలా కనిపిస్తోంది. ఇంట్లోకి వచ్చిన కొత్త హౌస్‌మేట్‌ను అప్పుడు బయటకు తీసుకొచ్చేస్తున్నారు అనిపిస్తోంది. అదేనండి స్వాతి దీక్షిత్‌ను అప్పుడే ఎలిమినేట్ చేస్తున్నారా.. అంటే కొత్త ప్రోమో చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఈ రోజు నామినేట్ అయిన వారిని సేఫ్ చేసే ప్రాసెస్ కాకుండా… ఏకంగా ఎలిమినేట్ చేసే ప్రాసెస్‌ను తీసుకొచ్చారు.
మామూలుగా అయితే ప్రతి వారం ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది. ఈ సారి శనివారమే పని కానిచ్చేస్తున్నారు. నాలుగో వారంలో కుమార్ సాయి, మెహబూబ్, సొహైల్, అభిజిత్, హారిక, స్వాతి దీక్షిత్, లాస్య నామినేషన్లో ఉన్నారు. వీరందరికీ నాగార్జున ఓ గన్ ఇచ్చి… కాల్చుకోమని అడిగారు. ఎవరి గన్‌లో బులెట్ పేలితో వారు ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. ఈ ప్రాసెస్‌లో స్వాతి గన్ పేలినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసేశారట.
ఈ ఎలిమినేషన్ విషయంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బయటకు తీసుకొస్తున్న స్వాతి దీక్షిత్‌ను ఇంటికి పంపించకుండా ఓ సీక్రెట్ రూమ్‌లో ఉంచుతారని అంటున్నారు. గత సీజన్లలో ఇలా పార్టిసిపెంట్లను సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అలా వెళ్లి వచ్చినవాడే. ఈసారి ఆ ఛాన్స్ స్వాతికి వచ్చిందనీ వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె వచ్చిన తొలి వారంలోనే ఇలా చేస్తారా అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. చూద్దాం ఈ రోజు రాత్రి ఏమవుతుందో?